29.7 C
Hyderabad
May 4, 2024 04: 21 AM
Slider ఖమ్మం

రూ.లక్ష బీసీ పథకం గడువు పొడగించాలి.

#BC scheme

వెనుకబడిన వర్గాల రూ. లక్ష పథకం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ అత్యధికులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పథకానికి అప్లై చేసుకోలేక పోయారని తెలిపారు.

ఈ ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. మీ సేవలో దరఖాస్తు చేసి తహసిల్దార్‌ కార్యాలయంలోని బాక్సుల్లో వేస్తే రోజుల తరబడి ఆ పెట్టెలు తెరిచే పరిస్థితి లేకుండా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.

మరోవైపు ఈ పథకం గడువు సమీపిస్తుండడంతో దరఖాస్తుదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండడంతో విద్యార్థుల సర్టిఫికెట్లను పక్కకు పెట్టి ఈ దరఖాస్తుల మీదనే రెవెన్యూ సిబ్బంది దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. రూ లక్ష బీసీ పథకం గడువు తేదీ పొడిగిస్తే విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి వీలవుతుందని సూచించారు. దీనికి తోడు రూ.

లక్ష పథకం విషయంలో పైరవీలు కూడా ఊపందుకున్నట్లు తెలుస్తోందని, అధికారులు దీనిపై దృష్టి సారించి నిజమైన అర్హులకి లబ్ధి చేకూరేలా చూడాలని కోరారు. అధికార పార్టీ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పదుల సంఖ్యలో దరఖాస్తులు తీసుకువస్తే వెంటనే సైట్‌ ఓపెన్‌ చేసి వాటిని క్లియర్‌ చేస్తున్న అధికారులు, పైరవీలు లేని అప్లికేషన్లను మాత్రం రోజుల తరబడి పెండిరగ్లో పెడుతుండడం సరికాదని నున్నా పేర్కొన్నారు. బీసీ పథకం దరఖాస్తుల గడువు పొడిగిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్న దృష్ట్యా తక్షణం ఈ నెలాఖరు వరకు పొడిగించాల్సిందిగా కోరారు.

Related posts

కొల్లాపూర్ పోలీస్ ల వ్యవహారశైలిపై..మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

ప్రజా సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలి

Satyam NEWS

అమరావతిలో సుజనా చౌదరి భూములు ఇవి

Satyam NEWS

Leave a Comment