28.7 C
Hyderabad
May 6, 2024 08: 03 AM
Slider ముఖ్యంశాలు

పంచారామాల దర్శనం కోసం మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు…

#rtc

ఈ కార్తీక మాసం.. పుణ్యప్రదమైన మాసం.ఆ లయకారుడైన శివుని దర్శనం చేసుకుంటే ప్రతీ ఒక్కరికీ పుణ్యఫలమే.ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ప్రయాణీకులకు అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో పంచారామాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం ,సామర్లకోట…ఈ అయిదు పుణ్య క్షేత్రాలను ఈ కార్తీక మాసంలో ఒకేసారి దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలమని పెద్దల అభిమతం.ఆ ఉద్దేశ్యం తోనే విజయనగరం ఆర్టీసీ శాఖ… ఈ నవంబర్ లో నాలుగు కార్తీక మాసాలలో ఆ అయిదం శైవ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం,….భక్త ప్రయాణీకులకు కల్పించింది.

ఈ మేరకు సూపర్ లగ్గరీకీ 1860,అల్ట్రా డీలక్స్ 1820,ఎక్సప్రెస్ 1460 రూపాయల చార్జీల తో రాను ,పోను సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆదివారం 30 వ తేదీ సాయంత్రం విజయనగరం డిపో నుంచీ ఆర్టీసీ అధికారులు.. రెండు బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు.మొత్తం 16 గంటలలో అయిదు పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించి.. మరల గమ్యస్థానాలకు తీసుకువస్తాయి..బయలుదేర న ఆర్టీసీ బస్ సర్వీసులు.

Related posts

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Satyam NEWS

అసలే ధరలు పెరిగి చస్తుంటే అందులో నీళ్ల కల్తీ…

Satyam NEWS

Leave a Comment