36.2 C
Hyderabad
May 14, 2024 17: 33 PM
Slider ఖమ్మం

జీఓ 4 ప్రకారం జీతాలు చెల్లించాలి

#aituc

గ్రామపంచాయతీ కార్మికులకు జీఓ నెంబర్ నాలుగు ప్రకారం నెలకు జీతం రూ.15600/-లుగా చెల్లించాలని, గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఎఐటియుసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 13న ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం నందు ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఖమ్మం జిల్లా మహా సభలు జయప్రదం చేయాలని కోరుతూ గిరిప్రసాద్ భవన్ లో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి సన్నాహాక  సమావేశం జరిగింది.  ఈసమావేశంలో సింగు నర్సింహారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖ లు సంస్థలు కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేస్,ఫుల్ టైం, కంటెంట్, కన్సాలిడేంట్ పే వర్కర్స్ వర్కర్స్ తో పాటు సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ వేతనాలు పెంచి 2021 జూన్ నెల నుండి వేతనాన్ని అమలు చేస్తుందన్నారు.

కానీ గ్రామపంచాయతీ కార్మికులకు, సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవా నెంబర్ 60 ని విడుదల చేస్తూ రూ,,15,600/-రూ, 19,500/,22,750/-లుగా నిర్ణయించి అమలు చేస్తుంది. 4 జీవో నెంబర్ విడుదల చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 15,600/-లుగా నిర్ణయించి చెల్లిస్తుంది తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా విపత్తులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజారోగ్యం కాపాడుతూ అధిక పని చేస్తున్నారని తెలిపారు.

Related posts

పాడి పశువులలో ఈతల మద్య కాలాన్ని తగ్గించాలి

Satyam NEWS

చేతి వృత్తిదారుల బహిరంగ ప్రజా విచారణ

Satyam NEWS

తెలంగాణ ద్రోహులను మోస్తున్న కాంగ్రెస్ బీజేపీ

Bhavani

Leave a Comment