28.7 C
Hyderabad
April 27, 2024 03: 08 AM
Slider మహబూబ్ నగర్

పాడి పశువులలో ఈతల మద్య కాలాన్ని తగ్గించాలి

#cattlecamp

పాడి పశువులలో ఈతల మద్య కాలాన్ని తగ్గించాలని వనపర్తి జిల్లా పశు వైద్య, పశు సంవర్థక అధికారి డాక్టర్ జి.వి రమేష్  పేర్కొన్నారు. బుధవారం సింగాయిపల్లి లో వనపర్తి పాల పరిధి వారు  పశు సంవర్ధక శాఖ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాడి పశవులలో ఈతల మద్య కాలాన్ని తగ్గించటం ద్వార పశువుల జీవిత కాలంలో ఎక్కువ పాల దిగుబడి,ఎక్కువ దూడలని పొందవచ్చునని ఆయన తెలిపారు.

దీని ద్వారా పాడి పరిశ్రమ రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ శిబిరాల ద్వారా  ఎదకు రాని పశువులు, గర్భ కోశ వ్యాధులు ఉన్న పశువులకు చికిత్సలు చేయడంతో  అవి త్వరగా ఎదకు వచ్చి చూలు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పుష్టికరమైన పశుగ్రాసాలు సాగు వలన దాన ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ లాభ సాటిగా ఉంటుందని, పాడి రైతులు అందరూ కూడా విధిగా పశుగ్రాసాలను సాగు చేయాలని సూచించారు.

పశువులు అన్నింటికీ విధిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో మహబూబ్ నగర్   పాల పరిధి  ఉప సంచాలకులు కవిత మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం విజయ డైరీ తీసుకుంటున్న చర్యలు, మున్ముందు రాబోతున్న పథకాల గురించి వివరించారు. విజయ డైరీ కి పాలు పోసి గిట్టుబాటు ధర పొందాలని కోరారు.

విజయ డైరీ కు పాలు పోస్తున్న రైతులకు లీటర్ కు రు 4/- అదనపు ప్రోత్సాహం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా భాను కిరణ్ , వనపర్తి పాల శీతలీరణ కేంద్రమేనేజర్, ప్రాణేష్, పాల సేకరణ కేంద్రం అధ్యక్షులు చంద్ర రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, రజిత వి ఏ కరుణాకర్, పాల ఉత్పత్తి దారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చెరువు కట్ట అక్రమాలకు తొలగింపుకు శ్రీకారం

Bhavani

గ్రీన్ ల్యాండ్ పాఠశాలలో వాటర్ బెల్ ప్రారంభం

Satyam NEWS

మత విశ్వాసాలను కించపరిచేవారిని సహించవద్దు

Satyam NEWS

Leave a Comment