28.7 C
Hyderabad
May 5, 2024 10: 13 AM
Slider మహబూబ్ నగర్

సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీ గండి

saralasagar

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని  సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీగా  గండి పడింది. ఈ రోజు ఉదయం 6 గం సమయంలో సరళాసాగర్ ప్రాజెక్టు కు గండి పడింది. వనపర్తి జిల్లాలో కొత్తకోట మండలంలోని శంకరయ్యపేట గ్రామ సమీపంలో కృష్ణానదికి ఉపనది అయిన చిన్నవాగుపై నిర్మించారు. గండిపడిన ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పరిశీలించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరం, బాధాకరమని మంత్రి అన్నారు.

తెల్లవారుజామున జరగడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ ను పూర్తిస్థాయిలో నింపుకున్నాం. అంతలోనే ఇలా జరిగింది అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మట్టికట్ట మాత్రమే తెగిపోయిందని, ప్రాజెక్ట్ మెయిన్ పార్ట్ స్టక్చర్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదని మంత్రి వెల్లడించారు. గండివల్ల అర టీ ఎం సి నీరు దిగువన ఉన్న రామన్ పాడు డ్యామ్ కి వెళ్ళింది.

Related posts

రష్యా సైన్యంలో అంతర్ యుద్ధం మొదలు?

Satyam NEWS

సోషల్ మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

అడ్డంగా దొరికి పోయిన అపర భగీరథుడు!

Satyam NEWS

Leave a Comment