35.2 C
Hyderabad
April 27, 2024 11: 37 AM
Slider సంపాదకీయం

అడ్డంగా దొరికి పోయిన అపర భగీరథుడు!

#KCR

తెలంగాణ లో ఓటింగ్ ప్యాట్రన్ ను మార్చడం కొసం, తనకు సోదరసమానుడైన కేసీఆర్ ను ఓటమి నుంచి తప్పించడానికి ఏపీ సీఎం జగన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ డ్రామా ఆడిన విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ డ్యామ్ కు 26 గేట్లు ఉండగా 13 గేట్లు తమ వాటా కింద వస్తాయని చెబుతూ నాగార్జున సాగర్ వద్ద నవంబర్ 30న పోలీసులను పంపి డ్రామా ఆడిన విషయం తెలిసిందే.

ఇలా చేయడం ద్వారా తెలంగాణ ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి, అక్కడ కష్టాల్లో ఉన్న కేసీఆర్ ను కాపాడాలని జగన్ ఎత్తుగడ వేశారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట్లపరంగా కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని ఈ వ్యూహాన్ని రచించాడని అంటారు. ఎలాంటి అవసరం లేకపోయినా నాగార్జున సాగర్ వద్ద ఆంధ్ర పోలీసులతో డ్రామా ఆడించడం, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడంతో డ్రామా రక్తి కట్టిందని అనుకున్నారు.

అయితే తెలంగాణ ప్రజలు మాత్రం జగన్ రెడ్డి డ్రామాకు పడిపోకుండా కేసీఆర్ కు వ్యతిరేకంగానే ఓటు వేశారు. దాంతో కేసీఆర్ కుర్చీ ఊడిపోయింది. దాంతో ఖంగు తిన్న జగన్ రెడ్డి సోషల్ మీడియా బ్యాచ్ జగన్ రెడ్డి అపర భగీరధుడు అంటూ కౌంటర్ ప్రచార స్ట్రాటజీని మొదలు పెట్టింది. నాగార్జున సాగర్ నుంచి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి కరువు లో ఉన్న ఆంధ్రా రైతాంగాన్ని కాపాడిన ధీరుడు అంటూ జగన్ కు హైప్ క్రియేట్ చేసింది.

అయితే ఇది అనాలోచిత చర్యగా అప్పటి నుంచి నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతునే ఉన్నారు. చివరికి అలానే జరిగింది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద జల ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

నిన్నటిదాకా రైతులకు నీళ్లు లేవు.. తాగడానికి నీరు లేదు అని హడావుడి చేశారు. కానీ ఇవాళ సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. మరి నాగార్జున సాగర్ పై చేసిన డ్రామా ఎందుకు ?

తుపాను వస్తుందని వారం రోజులకిందటే వాతావరణ శాఖ చెప్పింది. కానీ ముందు జాగ్రత్తలు.. రైతుల్ని అప్రమత్తం వంటివి చేయలేదు. పోలీసుల్ని పోలోమని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించారు. బలవంతంగా గేట్లు ఎత్తివేయించారు. ఎందుకంటే తమకు నీళ్లు కావాలని వాదించారు. ఎత్తి వదిలిన గేట్లు రైతులకు ఏమైనా ఉపయోగపడ్డాయా అంటే..లేదు. అవి కాలువలకు వచ్చే సరికి తుపాను వచ్చేసింది.

మరి ఆ నీరు ఎక్కడికి చేరినట్లు? ఇప్పుడు బలవంతంగా గేట్లు ఎత్తుకోవడం వల్ల నీరు వృధా అయింది. ప్రాజెక్టు కేంద్ర పరిధిలోకి వెళ్లింది. రేపు ఏపీ కోటా కింద విడుదల కావాల్సిన నీటిలో ఇటీవల బలవంతంగా విడుదల చేసిన నీటి కోటా ఉంటుంది. అసలు ప్రాజెక్టుల్లో నీరు లేని పరిస్థితుల్లో…ఆ నీరంతా వృధా చేసినట్లయింది. రైతుల నోట్లో మట్టికొట్టి చేసిన రాజకీయం ఎవరి కోసం ? అనే ప్రశ్న తలెత్తుతున్నది.

అందువల్ల జగన్ ఆడే డ్రామాలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. అక్కడ కేసీఆర్ కు ఇప్పటికే తిరస్కరణ జరగగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Related posts

మాజీ మంత్రి చిలుకూరి మృతి

Bhavani

కనకదుర్గమ్మవారికి సారె సమర్పించని పోలీస్ కమిషనర్

Satyam NEWS

హైద‌రాబాద్ శివారులో మ‌రో ఎకో టూరిజం పార్క్

Satyam NEWS

Leave a Comment