నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్ఏ గువ్వల బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆయన తెలిపారు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని 3వార్డులో కోటి రూపాయల నిధులతో మంజూరైన స్మశానవాటిక నిర్మాణానికి, అచ్చంపేట నుండి దర్శన్ గడ్డ గ్రామానికి 65 లక్ష రూపాయలతో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసీరాం, జిల్లా రైతు కమిటీ అధ్యక్షులు మనోహర్, గౌరవ కౌన్సిలర్స్ నర్సింహ గౌడు, రాజేందర్, మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మేఘనాథ్, ఎస్.టి. సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, మున్సిపల్ సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.