29.7 C
Hyderabad
May 4, 2024 04: 39 AM
Slider నెల్లూరు

ఘనంగా సత్య సాయిబాబా జ‌యంతి

Satya Saibaba

వెంకటగిరి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, శ్రీ. వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, డాక్టర్. వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర సూచనల మేరకు… ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నభగవాన్ శ్రీ సత్య సాయి బాబా 95వ జ‌న్మ‌దిన‌ వేడుకల్లో భాగంగా వెంకటగిరి భగవాన్ శ్రీ.సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో… పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి 95వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎస్. రామ్ మోహన్ రావు మాట్లాడుతూ… సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు సత్యసాయి వ్రతం నిర్వహించామని, మధ్యాహ్నం నారాయణ సేవలో భాగంగా 350 ఆహార ప్యాకెట్లను అన్నదానం చేశామని… శ్రీ సత్య సాయి బాల వికాస్ విద్యార్థులతో భజనలు నిర్వహించామని, అదే విధంగా సాయంత్రం భజన లతోపాటు ప్రసాద పంపిణీ, కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టామ‌ని ఎస్. రామ్ మోహన్ రావు వెంకటగిరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెంకటగిరి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎస్.రామ్మోహన్ రావు, విశ్రాంత ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ నాయుడు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి గోవిందరాజులు, నాగరాజు, వాసు, విజయ, శ్రీనివాసులు, వాణి, సుజాత, సుందరమ్మ, మహాలక్ష్మమ్మ తదితర బాబా భక్తులు పాల్గొన్నారు.

Related posts

కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ఎందుకో అంత హర్షం

Satyam NEWS

గుడ్ న్యూస్:కరోనా చికిత్స బిల్లు సింగపూర్ ప్రభుత్వానిదే

Satyam NEWS

Leave a Comment