26.7 C
Hyderabad
April 27, 2024 10: 18 AM
Slider కవి ప్రపంచం

ఎందుకో అంత హర్షం

#Manjula Surya New

నీ ఆనందాశ్రువుల్లో నింగీ నేల

తడిసి ముద్దవుతుంటే

ఈ హర్షానికి కారణమేమిటో తెలియక

నిన్నే చూస్తున్నాను

నీ హుషారుతో పరేషాన్ అయిన నేలతల్లి

నిన్ను ఒడిసిపట్టుకోవడం వల్లకాదంటూ

నేర్పుగా నిను బుజ్జగించి పంపగా

ముఖం మాడ్చుకోకుండా ముందుకెళుతున్న

నిన్ను చూసి భలే ముచ్చటేసింది సుమా

నీ వయ్యారపు వంకలతో దారులు మళ్లిస్తూ

కలిసిన అందరినీ తలో మునక వేయిస్తూ

బిడియ పడకుండా భేషజము చూపించకుండా అరమరికలు లేకుండా

వడివడిగా సాగుతూ కలివిడిగా తిరుగుతూ

వాగులు చెరువులు నదులన్నింటిని కలుపుకుంటూ

పాత కొత్త నీళ్ళు సమ్మిళతమై

 చేయి చేయి పట్టుకుని

అమ్యూజ్ మెంట్ పార్కుల్లో సందడి చేసినట్లు

అలుగులా పారుతూ జలపాతంలా జారుతూ

బడి వదిలిన పిల్లలు గేట్లు తోసుకుని

బయటికి వచ్చినట్లు సందడి చేస్తుంటే

సందులేక కురుస్తుంటే

చిందులెయ్యక చిద్విలాసంగా చూస్తున్న

నా కనుల ద్వయానికి విందే ఇస్తున్నట్లున్నావ్

ఎక్కడివారినక్కడే బందీనే చేస్తున్నావ్

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

వరదల కారణంగా ఆర్ధికంగా పతనమైన పాకిస్తాన్

Bhavani

పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన రాగిడి

Satyam NEWS

6 వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా

Satyam NEWS

Leave a Comment