28.7 C
Hyderabad
May 5, 2024 23: 43 PM
Slider ప్రత్యేకం

స‌త్యం న్యూస్ కు ఎన్ కౌంట‌ర్ వీడియో….!

#www.satyamnews.net exclusive

ప‌త్రిక‌లు పోయే,ఛాన‌ళ్లూ పోయే..ఇప్పుడు అంతా డిజిట‌ల్ యుగం.పీఎం మోడీ చెబుతున్న‌ట్టుగా అంతా డిజిట‌ల్ మాయ‌.ఈ త‌రుణంలోనే వార్త‌లు కూడా…ఆన్ లైన్ సైట్ల‌తో శ‌ర వేగంగా ప్ర‌జ‌ల‌కు చేరువవుతున్నాయి.

అందులోంచి పుట్టిందే…స‌త్యం న్యూస్.నెట్. తాజాగా…ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రంలో జ‌రిగిన బీక‌ర ఎన్ కౌంట‌ర్ లో దాదాపు 30 జ‌వాన్లు మృతి చందారు. అందుకు సంబందించి..ఓ వీడియో ఒక‌టి స‌త్యం న్యూస్.నెట్ కు అందింది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్.సుక్మా జిల్లా స‌రిహ‌ద్దు‌లో జ‌రిగిన భీక‌ర ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది.

త‌ర‌చూ  దంతేవాడ‌,సుక్మా జిల్లాలో  అటు మావోయిస్టుల మెరుపు దాడుల‌కు బదులుగా భ‌ద్రతా బ‌ల‌గాలు కూడా అదే రీతిలో కాల్పులు జ‌రిపే క్ర‌మంలోఎన్నో ప్రాణ‌లు నేల కొరిగాయి. తాజాగా…రెండు రోజుల పాటు జ‌రిగిన భీక‌ర పోరులో…  విజయనగరం జిల్లాకు చెందిన , సీఆర్పీఎఫ్‌ జవాన్‌ 27 ఏళ్ల రౌతు జగదీష్ మృతి చెందాడు.

జిల్లా పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు.

బీజాపూర్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.

మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైనట్టు తెలుస్తోంది.కాగా ఎన్ కౌంట‌ర్ కు సంబందించి  ఓ వీడియో..స‌త్యం న్యూస్.నెట్ కు ల‌భ్య‌మైంది. ఆ వీడియో మీ కోసం..

For Video please visit www.satyamnews.net

Related posts

ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ రద్దుపై ముందుకే: రైతు ఐక్య కార్యాచరణ కమిటీ

Satyam NEWS

ఏపిలో క్రైస్తవ మత వ్యాప్తిపై చర్యలు తీసుకోండి

Satyam NEWS

Leave a Comment