30.7 C
Hyderabad
May 13, 2024 00: 57 AM
Slider కవి ప్రపంచం

ఆకాశం భూమి మధ్యలో వాన

#arunachamarthi

పొంగి పారినది ఊరంత

ముంగిట పేర్చినది కల్మషమంత

చేసుకున్న వారికి చేసుకున్నంత

చదును చేసేస్తే వాటి ఆవాసాలు

చేరకేం చేస్తాయి మన నివాసాలు

చెట్టు చెరువు మాయం

ఎటు చూసిన ఇంటి మీదిల్లు మయం

భూమి కంపమై బెదిరించిందో

ఆకాశం ఉరుమై ఉరిమిందో

పంచభూతాలను మృగ్యం చేసే మానవ ప్రయత్నం

తిప్పి కొడితే సాగదు ఏ యత్నం

రోడ్డు కనిపించని నదీ ప్రవాహం

తెగించి వస్తే వాహనం మనిషి ఆవాహం

మనకే మనమే పెట్టుకుంటున్న భస్మాసుర హస్తం

ప్రకృతి ప్రకోపిస్తే పనికిరావు ఏ జాగ్రత్తలు ఏం చేస్తం

మిన్ను మన్ను అయినట్లు ఏకం

వాన చినుకు సందేశం

అరుణ చామర్తి  ముటుకూరి, హనుమకొండ

Related posts

మెగాస్టార్ ఆశీర్వాదాలు తీసుకున్న సోము వీర్రాజు

Satyam NEWS

న్యాయ రాజధానిపై ఏపి హైకోర్టు కీలక ఉత్తర్వులు

Satyam NEWS

జనవరి 3,4 తేదీల్లో ఏఐటీయూసీ మహాసభలు

Satyam NEWS

Leave a Comment