26.7 C
Hyderabad
April 27, 2024 10: 04 AM
కవి ప్రపంచం

అంతులేని కథ

#NaligalaRadhikaratnaNew

యుగ యుగాల చరిత్ర లో…

పునీతమైన ఈ ధరిత్రి లో…

కుబుసం విడిచిన కుసంస్కారంతో…

చట్టాన్ని చుట్టంగా చేసుకున్న

కామాంధుల కాటుకు బలైపోతూ… మౌనంగా రోదిస్తున్న ఓ మగువా… !!

మగవాడి వేగటు  చేష్టలు ముందు ….

నీ వేదన… అరణ్య రోదనే….

మానవత్వం మరిచిన

ధృతరాష్ట్రుల పాలనలో ….

వావివరసలు మరిచి..

విలువలకు శిలువ వేసి

మానవ సంబంధాలు నరికేసే….

మధాందుల వేటుకు

మసకబారుతూ

మౌనంగా రోదిస్తున్న  ఓ మగువా…. !!

మగవాడి

వికటాట్టహాసపు చర్యల ముందు 

నీ వేదన… అరణ్య రోదనే !!

జనారణ్యంలో….

మనుషులే మృగాలుగా మారి ఆడపిల్లలను లేడి పిల్లలు గా

వేటాడి వెంటాడే

మానభంగ పర్వంలో ….

తాను భద్రంగా ఉన్నానని

భారతీయ  మహిళ

ఏనాడు భావించ గలుగుతుందో

ఆనాడే…

భారతదేశం మౌలిక  సంస్కృతితో… ప్రపంచ యవనికపై

శిఖరాగ్రాన నిలబడుతుంది

“అంతులేని కథ కు”

ముగింపు దొరుకుతుంది….

నలిగల రాధిక రత్న, PH:8639635538

Related posts

ఘనత

Satyam NEWS

అతనో పాఠ్యాంశం

Satyam NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS

Leave a Comment