32.2 C
Hyderabad
May 16, 2024 11: 41 AM
కవి ప్రపంచం

పీవి భారతదేశ ఠీవి

#Tumma Janardhan

అపార మేధో సంపన్నుడు

దేశానికి వెన్నెముకగా వెలిశాడు

ఊబిలో ఉన్న దేశాన్ని పైకెత్తాడు

అభివృద్దిని ఊర్ధ్వముఖం చేశాడు.

వంగరలో ఉదయించిన సూర్యుడు

పాములపర్తి వారి దత్త పుత్రుడు

భూసంస్కరణలలో ప్రథముడు

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు.

పాములపర్తి వెంకట నరసింహా రావు

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా ఎదిగినాడు

ప్రత్యేకతలతో అలరారిన బహు భాషా పండితుడు

ప్రతిభతో దేశాన్ని నడిపించిన ధీరుడు.

ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి

దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టి

దేశ ప్రజల సంక్షేమము తలపెట్టి

తెచ్చెను మార్పులు దేశాభివృద్ధి మొదలెట్టి.

ప్రధాన మంత్రి పదవికి వన్నెలద్దిన పీ.వి.

మహా నేతగా, కవిగా ప్రణుతికెక్కిన మేధావి

తెలుగు రాష్ట్రము, భారత దేశమునేలిన రవి

ఏ పదవికైనా వన్నెతెచ్చిన పీవి తెలుగుజాతి కాదు భారత దేశ ఠీవి.

తుమ్మ జనార్దన్ (జాన్) దిల్ సుఖ్ నగర్, రంగారెడ్డి జిల్లా, చరవాణి 9440710501

Related posts

ఆషాఢమాసం బోనాలు

Satyam NEWS

పవిత్ర మాసం

Satyam NEWS

దివ్య దీప్తుల దీపావళి!

Satyam NEWS

Leave a Comment