32.2 C
Hyderabad
May 9, 2024 22: 13 PM
కవి ప్రపంచం

స్వర్ణయుగం

#Kusumakumari Uppalapati

ప్రజాపాలనలో స్వర్ణయుగం మొదలయింది

పుంభావ సరస్వతి పుడమిపై పురుడు పోసుకుంది

విజ్ఞానం, వైదుష్యం కవచ కుండలాలుగా తెలుగు తేజం  తెలంగాణా గడ్డపై  ఆవిర్భవించింది

నారసింహ అవతారం భువిపై పివియై నిలిచింది

చదువులన్నీ అతని చంకనెక్కాయి

భాషలన్నీ యేకమై  మమేకమే అయ్యాయి

దేశభక్తి స్వేచ్చకొరకు పరుగులు పెట్టించింది

పెద్దలతో  సాంగత్యం పరిణితినే ఇచ్చింది  

చేయబోయె బృహత్కార్యాలకి పునాదిగా నిలిచింది

కరం కలిపి కాంగ్రెస్ కి అభయ హస్తమిచ్చింది

మేధస్సు,వర్చస్సు,  ప్రేయస్సుగ శ్రేయస్సునే ఇచ్చింది 

పదవులెన్నో తెచ్చింది

అవకాశం, సామర్ధ్యం అందుబాటు కొచ్చాయి 

ప్రధమంగా ప్రతిభకి  ప్రధాని పదవి పట్టం కట్టింది

తెలుగు బిడ్డ భరత గద్దె  సగర్వంగ యెక్కింది

రాజకీయ రంగంలో కొత్త శకం మొదలయింది

అపర చాణుక్యుడు అవనిపై తిరిగి అవతరించాడు

అర్థశాస్త్ర అస్త్రంతో ఆర్థికరంగం విప్లవాత్మక అభివృద్ధి వైపు విరుచుకు పడింది

భూమి చట్టం ఆర్ధిక సమతుల్యం వైపు అడుగులు వేయించింది

అణ్వాయుధ ఆధునీకరణ సరిహద్దు శత్రువుల నదుపులోకి తెచ్చింది

 విదేశాంగ విధానము  విశ్వాన్నే విస్మయ పరిచింది! ముక్కుమీద వేలేయించింది 

మేధావులు, మెరికలు ముందువరుస కొచ్చారు

సాహిత్యం, సంగీతం సమఉజ్జీలై  జీవం పోసుకున్నాయి    జీవం పోసాయి

మొనార్కీలు, అనార్కీలు మూట, ముల్లె సర్దాయి 

సామాన్య, అసామాన్యులకి ఆహ్వానం పలికాయి!

ప్రజాపాలనలో స్వర్ణయుగం మొదలయింది

కుసుమ కుమారి ఉప్పలపాటి 

Related posts

బోనాల పండుగ

Satyam NEWS

బలగంలేని బలమైన నాయకుడు

Satyam NEWS

ప్రకృతి ఒడిన పరవశించిన వేళ

Satyam NEWS

Leave a Comment