36.2 C
Hyderabad
May 15, 2024 17: 12 PM
కవి ప్రపంచం

పవిత్ర మాసం

#Puli Jamuna

కార్తీకమాసం పరమ పవిత్రమాసం

హరిహరులకు అత్యంత ప్రీతికరం

ఉషోదయ కాల చన్నీటి స్నానాలు

తులసీకోట ప్రదక్షిణలతో

ప్రమదలు వెలిగించు ప్రమిదలతో

సర్వ శుభాలందించు కార్తీక మాసం

రుద్రాభిషేకాలతో లింగార్చనలతో

ఉపవాస దీక్షలు శివనామ స్మరణలు

ఉసిరికాయ దీపారాధనతో

కోటి బిల్వార్చనల పూజలు

శ్రద్ధతో ఆచరించు కేదారీశ్వర నోములు

సత్యనారాయణ స్వామి వ్రతాలు

ధూప దీప నైవేద్యాలతో

ఫల పుష్ప గంధాదులతో

భక్త జనుల హరిహర పూజలతో

ఆలయాలు శోభాయమానం

నిండు పున్నమి పండు వెన్నెల జిలుగులతో

వెన్నెల రేడు వెలుగులు పంచగా

కార్తీక దీపాల కాంతులు దేదీప్యమానం

కార్తీక పౌర్ణమి కామితాలను తీర్చగా

అజ్ఞానం ఆవరించిన సమాజ గమనంలో

అనురాగ దీపాల వెలుగులు ఆవరించాలి

మది మదిలో మమతలు వెల్లి విరియాలి

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682.

Related posts

ఆశగా ఎదురుచూస్తున్న”బడి”

Satyam NEWS

ఓంకార నాదా

Satyam NEWS

మోహగీతం

Satyam NEWS

Leave a Comment