40.2 C
Hyderabad
May 6, 2024 16: 27 PM
కవి ప్రపంచం

స్ఫూర్తి ప్రదాత

#R.Madhavi

సూర్య కిరణాల

వెలుగు వలె ప్రకాశించాడు

తెలుగు తల్లి ముద్దుబిడ్డ

అతను ఎవరో కాదు మన

తెలుగువాడు

అలుపెరగని ఉద్యమకారుడు

గొప్ప సాహితీ వేత్త

అన్ని రంగాల్లో తనదైన శైలితో

పరిచయం అయ్యాడు అతను ఎవరో కాదు మన తెలుగువాడు..

భారతదేశానికి  ప్రధానిగా

బాధ్యతలను స్వీకరించిన

ఘనుడు తెలుగు జాతికి

స్ఫూర్తి ప్రదాత బహుముఖప్రజ్ఞశాలి

అపరమేధావి అతను ఎవరో కాదు మన తెలుగువాడు

న్యాయం కోసం పోరాడే న్యాయమూర్తి

చరిత్రను తిరగరాసిన చరిత్రకారుడు అతను ఎవరో కాదు మన తెలుగువాడు

తెలంగాణ బిడ్డ…

పేరు ప్రఖ్యాతలు వున్న

ఎన్ని సిరిసంపదలు వున్న

నిరాడంబరమైన జీవనం సాగించేవాడు అతను ఎవరో కాదు మన తెలుగువాడు

తెలుగువారి హృదయాల్లో

అమరుడిగా నిలిచిన

తెలుగుతేజం

పి.వి నరసింహారావు

ఆర్. మాధవి, హైదరాబాద్

Related posts

స్వాగతం

Satyam NEWS

ఈ రాత్రిని యిలా గడిచిపోనీ

Satyam NEWS

ఆశగా ఎదురుచూస్తున్న”బడి”

Satyam NEWS

Leave a Comment