Slider కవి ప్రపంచం

చినుకు చిరుస్పర్శ

#Manjula Surya

అనుక్షణం  నిరీక్షించి

నీరసించి నిర్వేదమైన వేళ

తపించిన మనసును చల్లని పిల్లగాలి చుట్టుకున్న ఆనందహేల

ఉరుములే మంగళవాద్యాలై

నల్లని మబ్బుతునకలు ఏడువారాల కానుకై

మెరుపు దివిటీలు దారి చూపిస్తుంటే

మేఘాల గుర్రమెక్కి

తలంబ్రాలై  తొలకరిజల్లులు జాలువారగా

తపనల చినుకుల చిరు స్పర్శలో

ఒక్కసారిగా ఝల్లుమన్న

పుడమి అణువణువున పులకరింపుల

వేణువులే

ఎదురుచూస్తున్న ఆ మట్టిరేణువుల

గుండె గూటిలో

వేవేల వేకువల సంభ్రమలే

దూరం భారమై విరహము వేదనై

ఇక వల్లకాదంటూ వర్షమైన

ఆ ప్రేమ తడిని

తనువంత నలుగుల పూసుకుంటూ

గుప్పెడు మల్లెలు ఫక్కున నవ్వినట్లు

మట్టివాసన  మధుపర్కమే అయ్యింది

ఏడడుగుల ఏరువాకె అయ్యింది

రేపటి పచ్చని పందిరిని తలుచుకుంటూ..

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

జీఎంఆర్ ‘వాట్సాప్ వర్చువల్ అసిస్టెంట్ చాట్-బాట్’

Sub Editor

బాలివుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మళ్లీ ఉపశమనం

Bhavani

Leave a Comment