42.2 C
Hyderabad
April 30, 2024 17: 26 PM
Slider నల్గొండ

బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

#congressparty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్ లో గల చింతల మిల్లు ఆవరణలో బ్రిక్ వర్కర్స్(ఇటుక కూలీలు)హమాలీ వర్కర్స్ ఐ ఎన్ టి యు సి అనుబంధ యూనియన్ సమావేశం యూనియన్ ప్రధాన కార్యదర్శి కోలా తాతారావు అధ్యక్షతన గురువారం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిల్డింగ్ సెస్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడంలో కార్మిక శాఖ విఫలమవుతున్నదని,గతంలో జిల్లాల స్థాయిలో క్లెయిములు జిల్లా అధికారుల ద్వారా విచారణ జరిపి అందించే వారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యంతో పరిష్కారాలు కావడం లేదని అన్నారు.

బిల్డింగ్ వెల్ ఫేర్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.ఏరియా స్థాయి లేబర్ అధికారులను కూడా నియమించలేదని దుస్థితి లేబర్ డిపార్టమెంటుకు ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం బిల్డింగ్ వెల్ ఫేర్ బోర్డు నిధులను పక్కదారికి మళ్లించకుండా కార్మికులకే  వినియోగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య, మేళ్ళచెరువు ముక్కంటి,పాశం రామరాజు యాదవ్,సలిగంటి జానయ్య, పోతనబోయిన రామ్మూర్తి,పాలకూరి లాలు,మేస్త్రీలు రాంబాబు,రాజు, లక్ష్మి,కుంట రాము,యాకమ్మ, మాలక్ష్మమ్మ,మలికంట సైదులు, ముక్కెర సరోజన,మామిడి లక్ష్మణ్, రాజు,కాసాని బేబీ,రాళ్ళబండి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే న్యాయవాదుల జంట హత్య

Satyam NEWS

మురళి కృష్ణ ఆలయ అసోసియేషన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

మోక్షజ్ఞ ఎంట్రీ దసరా నుంచేనా ??

Bhavani

Leave a Comment