42.2 C
Hyderabad
May 3, 2024 17: 00 PM
Slider నిజామాబాద్

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

#kalvakuntlakavita

వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ లో సమీక్షించారు. ఈ రోజు నిజామాబాద్ లో స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నందిపేట్,సిరికొండ,బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్న ఎమ్మెల్సీ కవిత, నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్ క్రిస్టినా మధ్యాహ్నం నిజామాబాద్ లో పర్యటించనున్నారు.

Related posts

ఏప్రిల్ 10వ తేదీ నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

పేదల దీవెనలు ప్రధాని నరేంద్రమోడీకి ఉండాలి

Satyam NEWS

కాంగ్రెస్ గెలుపు తో వైసీపీ గుండెల్లో రైళ్లు

Bhavani

Leave a Comment