27.7 C
Hyderabad
May 16, 2024 05: 50 AM
Slider కవి ప్రపంచం

పంద్రాగస్టు

#K.Harinath

విషపురుగుల స్వైరవిహారంలో

సైద్ధాంతిక ధరణీచక్రం

తిరుగుతోంది అగమ్యగోచరంగా

నవచేతన పతాకానికి

సాలెగూడులా చుట్టుకుంటున్నారు

దుష్టశక్తుల రాజకీయ నాయకులు

ప్రగతిపదం జగతి సిగన

కాంతిపూలు పూయంగా

పుడమి తల్లి నెన్నెదుట

విజయతిలకం దిద్దంగా

కదిలిరండి! కదిలిరండి!

దిగ్విజయంగా గగన తలంపై

వీర విహారం చేస్తున్న

చంద్రయాన్ -3

మన సైంటిస్టుల ఘనచరితకు

జోహార్ జోహార్

ఎగురుతున్న పతాకమా

మృగ్యమవుతున్న జీవితానికి

వెలుగుదారి చూపించు

పంద్రాగస్టు పర్వదినం

సంబరంగ జరిగేలా

క్రొంగొత్త దారులు చూపుతూ

నీ రాకతోనైనా

ఈ విశ్వం పునీతం కావాలని

కొరుప్రోలు హరనాథ్, 9703542598

Related posts

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉక్కుపాదం

Satyam NEWS

ఎదురు కాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ మృతి

Satyam NEWS

వృత్తి ధర్మం తప్పిన జర్నలిస్టుపై బహిష్కరణ వేటు

Satyam NEWS

Leave a Comment