38.2 C
Hyderabad
April 29, 2024 21: 50 PM
Slider విజయనగరం

“స్పందన”కు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా….!

#depika

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ  ఎం. దీపిక  నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ.. 35 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే… నెల్లిమర్లకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను ఒక వ్యక్తిని ప్రేమించుకున్నట్లు, ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు వలన సదరు ఫిర్యాది వేరే వ్యక్తిని పెండ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో, ఆమె ఫోటోలను వారి బంధువులకు పంపి, వేధిస్తున్నట్లు, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని నెల్లిమర్ల ఎస్ఐను ఆదేశించారు.

ఎస్.కోటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేస్తూ తనకు ఎస్.కోట రెవెన్యూ పరిధిలో 1.09 ఎకరం వ్యవసాయ భూమి ఉండగా, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, 0.80 ఎకరం మాత్రమే తనకు చెందు తున్నట్లు, మిగిలిన భూమిని వేరే వ్యక్తికి చెందినదిగా మోసపూరితంగా రికార్డుల్లో చూపుతున్నారని, ఈ మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్.కోట ఎస్ఐను ఆదేశించారు.

జామి మండలం, భీమసింగికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేస్తూ విటి అగ్రహారానికి చెందిన కొంతమంది వ్యక్తులు స్ధలంను విక్రయించేందుకు అగ్రిమెంటు చేసి, అడ్వాన్సుగా 4.20 లక్షలు తీసుకొని, రిజిస్ట్రేషను చేయకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించినట్లు, ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ సిఐను ఆదేశించారు.

బొండపల్లి మండలంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తనను లైంగింకంగా వేధిస్తున్నట్లు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను నగరంలోని ఒక నగల షాపులో సేల్స్ మేన్ గా ఒక సం. పని చేసేందుకు అగ్రిమెంటు కుదుర్చుకొన్నట్లు, గడువు పూర్తి కావడంతో వేరే ఉద్యోగంకు వెళ్ళిపోయేందుకు తనను షాపు యజమాని అంగీకరించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను ఎ.ఎన్.ఎం.గా శిక్షణ పొందినట్లు, విశాఖపట్నంకు చెందిన ఒకామె ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని నమ్మించడంతో, ఆమెకు 1.35 లక్ష ఇచ్చినట్లు, సదరు వ్యక్తి ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యోగం కల్పించక పోవడంతో, డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుసార్లు కోరినప్పటికి, డబ్బులు ఇవ్వకుండా త్రిప్పుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్, దిశ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ జె. మురళి, ఎస్బీ సీఐలు కె.కె.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరప్షన్: కలెక్టరేట్ లో అవినీతి తిమింగలం

Satyam NEWS

అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ ఫ‌స్ట్ లుక్

Satyam NEWS

దిశ హత్య దేశంలో ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది

Satyam NEWS

Leave a Comment