28.7 C
Hyderabad
May 5, 2024 09: 46 AM
Slider ప్రత్యేకం

కోమటిరెడ్డి గ్రూపుల సంస్థల్లో పన్ను చెల్లింపు అవకతవకలు

#susheeinfra

సుశీ గ్రూపులకు చెందిన 16 సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) దాడులు

ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) అధికారులు  నేడు కోమటి రెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై 16 బృందాలు దాడులు నిర్వహించాయి. హైదరాబాద్ నగరంలోని రెండు భవనాలలో ఉన్న సుశీ సంస్థలకు చెందిన కంపెనీలపై నిర్వహించిన తనికీల్లో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా ప్రాధమికంగా అంచనా వేశారు.

నేడు ఉదయం సుమారు పదకొండున్నరకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగిసిన ఈ తనికీల్లో, లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని లభ్యమైన పత్రాల ద్వారా కనుగొన్నారు. వీటితో పాటు ఈ కంపెనీల్లోని లాప్ టాప్లు, కంప్యూటర్ల లోని సమాచారం ప్రకారం పలు అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు కూడా జరిగినట్టు గుర్తించారు.

ఈ 16 సంస్థల్లో ఒక సంస్థ సహకరించనందున ఆ సంస్థ కార్యాలయంలోని బీరువా లోఉన్న లాకర్ ను సీల్ చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా క్రయ విక్రయాలు జరపడం తదితర అక్రమాలకూ పాల్పడ్డట్టు కూడా గుర్తించారు.  ప్రాథమిక అంచనా మేరకు సుశీ గ్రూపుల సంస్థలు వందల కోట్ల పన్నుల ఎగవేతకు పాల్పడ్డట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఈ పన్నుల ఎగవేతపై విచారణను / దర్యాప్తు ను కొద్దీ రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేసి, స్పష్టమైన నిర్దారణకు వాణిజ్య పన్నుల శాఖ రానుంది.

ఈరోజు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుశీ గ్రూపు సంస్థలు ₹ 350 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డాయని అభియోగం. అధికారులు ఆయన కంపెనీలకు చెందిన మరో ర్యాక్ ను రేపు తెరవనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎగవేత సొమ్ము మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల భోగట్టా.

Related posts

సిగ్గు మాలిన, దిక్కమాలిన సీఎం…!

Satyam NEWS

విడుదల సన్నాహాల్లో “వి లవ్ బ్యాడ్ బాయ్స్”

Satyam NEWS

కరోన పట్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలి

Satyam NEWS

Leave a Comment