28.7 C
Hyderabad
April 26, 2024 08: 55 AM
Slider వరంగల్

సర్వ మతాలకు ఆలయం గ్రంథాలయం

The temple is a library for all religions

జ్ఞాన సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలుగా నిలుస్తాయని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అభివర్ణించారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా హాజరయ్యారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు, గ్రంథాలయాల పితామహుడు డా.ఎస్. ఆర్.రంగనాధన్

చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా జాతీయ పక్షి,జంతు పరిరక్షణపై విద్యార్థులకు చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన తరగతులుగా నిరంతరం ఉంటాయని, భారతదేశంలో విభిన్న మతాలు ఉన్న గ్రంథాలయాలు సర్వమతలకు ఆలయాలుగా కొనసాగుతాయని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, లైబ్రేరియన్ సమ్మక్క, ఎంపిటిసి గొర్రె సమ్మయ్య,పోశాల వీరమల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రాష్:ఎంపీలో ఫుట్ ఓవర్‌ వంతెన కూలి 6గురికి గాయాలు

Satyam NEWS

అవినీతిపరులను రక్షించేందుకు కేంద్రం మార్గదర్శకాలు

Satyam NEWS

కేంద్రంలోని బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన వైసిపి నేత

Satyam NEWS

Leave a Comment