33.2 C
Hyderabad
May 4, 2024 01: 24 AM
Slider నిజామాబాద్

ప్రపంచ మృత్తిక ఆరోగ్య దినోత్సవ౦

#Soil Health Day

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దతక్కడ్పల్లి గ్రామంలో  ప్రపంచ మృత్తిక ఆరోగ్య దినోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ ఏడీఎ ఆంజనేయులు మాట్లాడుతూ  భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులపై నా రైతులు మొగ్గు చూపాలని అప్పుడే భూసారం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. గతంలో సేంద్రియ ఎరువులతోనే  పెద్దలందరూ ఆరోగ్యవంతంగా భూమిని కాపాడుకొని వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

ప్రస్తుతం రసాయనిక ఎరువులు వాడటం వలన  భూమి మరికొన్నేళ్లలో బీడుగా మారే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో భూమిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా అంతేనన్నారు.

కార్యక్రమంలో ఏడీఏతోపాటు బిచ్కుంద వ్యవసాయ అధికారి పోచయ్య, జుక్కల్ వ్యవసాయ అధికారి నవీన్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు పటేల్, గ్రామ సర్పంచ్ పుండ్లిక్ ,ఆయా గ్రామాల ఏఈవోలు గ్రామ రైతులు ఉన్నారు.

Related posts

విధ్వంసంతో ప్రభుత్వాన్ని లొంగదీయడం సాధ్యమా?

Satyam NEWS

తెలంగాణ లో అనుమతిలేని కాలేజీల మూసివేత

Satyam NEWS

విభజన సమస్యలపై ఏపి తెలంగాణ చర్చలు

Satyam NEWS

Leave a Comment