కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కడుపు నొప్పి తో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. అస్వస్థతకు గురయినా సోనియా ను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ విషయంపై గంగారామ్ ఆసుపత్రి బోర్డు చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా ఇవాళ మాట్లాడుతూ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సోనియా గాంధీ కడుపు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తేలిందని తెలిపారు.
గతం నుండే ఒవేరియన్ కాన్సర్ తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్నారని ,ఇందులో భాగం గానే కొంత ఇన్ఫెక్షన్ కు గురైందనై పేర్కొన్నారు.అలాగే ఆమెకు తగిన వైద్యం అందిస్తున్నామని త్వరలో కోలుకుంటుందని ఆయన పేర్కొన్నారు.ఆమెతో రాహుల్గాంధీ,ప్రియాంక రాబర్ట్ వాడ్రే లు ఉన్నారు.