26.7 C
Hyderabad
April 27, 2024 09: 10 AM
Slider ముఖ్యంశాలు

సీపీఎస్‌ రద్దు హామీ: 7 రోజులన్నారు..765 రోజులైంది

#Raghurama

సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు ఏపి సీఎం వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ని కోరారు.

ఈ మేరకు ఆయన తన రెండో లేఖను రాశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ నిన్న లేఖ రాసిన విషయం తెలిసిందే.

తాజాగా సీపీఎస్‌ హామీని నిలబెట్టుకోవాలంటూ మరో లేఖ రాశారు. సీఎం జగన్‌ తన పాదయాత్రలో సీపీఎస్‌ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

పాత విధానాన్ని కొనసాగిస్తానన్నారని జగన్‌ తెలిపినట్లు లేఖలో ప్రస్తావించారు. సీపీఎస్‌ విధానం రద్దు హామీతో ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లోనే జగన్‌ హామీ నెరవేరుస్తానన్నారని.. ఇప్పటికి 765 రోజులు దాటినా ఆ హామీ నెరవేరలేదన్నారు.

సీఎం జగన్‌ సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంపీ రఘురామ కోరారు.

Related posts

డొనేషన్స్: కరోనా కట్టడికై ముందుకు రండి

Satyam NEWS

పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ మురళి కృష్ణ

Satyam NEWS

రెండు నెలల్లో 1300 ఇళ్లు పూర్తి కావాలి…!

Bhavani

Leave a Comment