27.7 C
Hyderabad
May 4, 2024 07: 38 AM
Slider విజయనగరం

రౌడీ షీటర్ల జీవనశైలిపై ప్రత్యేక నిఘా..!

#deepika

మాసాంతర నేర సమీక్షా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ వివిధ పోలీసు స్టేషనుల్లో రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల నేర ప్రవృత్తి, ప్రవర్తనపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తులు ఇంత వరకు ఏయే నేరాలకు పాల్పడ్డారు.

వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రస్తుతం సదరు వ్యక్తుల నేర ప్రవృత్తి, ప్రవర్తన, జీవనశైలి గురించి సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీట్లు తెరవబడి, సత్ప్రవర్తన కలిగి, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సామాన్య జీవనం సాగిస్తూ, భవిష్యత్తులో ఎటువంటి నేరాలకు పాల్పడరన్న వ్యక్తుల షీట్లును డీఎస్పీ స్థాయి అధికారులు ఒకసారి సమీక్షించి, వాటిని మూసివేయాలన్నారు.

రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, జీవనశైలిని గురించి క్షేత్రస్థాయి విచారణలో మహిళా సంరక్షణ పోలీసుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణ, రవాణను అరికట్టి, విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరించేందుకు అవగా కార్యక్రమాలు చేపట్టాలని, విద్యా సంస్థలు, ముఖ్య కూడళ్ళులో ప్రత్యేకంగా రూపొందించిన హెూర్డింగులను ఏర్పాటు చేయాలన్నారు.

గంజాయిని విక్రయించే చిన్న వ్యాపారులు, గంజాయి సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి ఎక్కడ నుండి తీసుకొని వచ్చినది, అందుకు కారకులైన వ్యక్తుల సమాచారాన్ని విచారణలో రాబట్టి, వారిని కేసుల్లో నిందితులుగా చేర్చాలన్నారు. నిందితులకు శిక్ష పడేందుకు కొన్ని కేసులను సంబంధిత పోలీసు అధికారులు ప్రాధాన్యత కేసులుగా తీసుకొని, వాటిలో ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తయి, నిందితులకు శిక్షపడే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

“జగనన్నకు చెబుదాం” వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇచ్చి, నిర్ధిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి, వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం, జిల్లా ఎస్పీ గ్రేవ్ కేసులను, పోక్సో కేసులు, నాన్ గ్రేవ్ కేసులను సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉన్న కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

బుదరాయవలస పిఎస్ లో నమైన సైబరు నేరంలో నిందితుడిని అరెస్టు చేసి, పోయిన నగదులో 8.64 లక్షలు రికవరీ చేయుటలో మంచి ప్రతిభ కనబర్చిన ఎస్ఐ సిహెచ్. నవీన్ పడాల్ ను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రత్యేకంగా అభినందించి, జ్ఞాపికను, ప్రశంసా పత్రంను అందజేసారు. అదే విధంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి, గత నెల లో నమోదైన కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయుటలోను, పోయిన ఆస్తులను రికవరీ చేసినందుకు, గంజాయి అక్రమ రవాణను నియంత్రించి, ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు చీపురుపల్లి సీఐ జి. సంజీవరావు, బొండపల్లి ఎస్ఐ ఎస్.రవి, సీసీఎస్ ఎస్ఐ ఎస్. సుదర్శన్, డిసిఆర్బి ఎస్ఐ ఆర్. వాసుదేవ్, ఎఎస్ఐ ఎ. గౌరీ శంకర్, హెచ్సి జి. జనార్ధనరావు, కానిస్టేబుళ్ళు జి. లావణ్య, టి. అప్పల నాయుడు, జి. దాసు, కే.రమేష్, ఎం. మురళి, ఎన్. రవి కుమార్, జి.గౌరీ శంకర్, హెూంగార్డు ఎం. సురేష్లను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.

ఈ సమీక్షా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీధర్, ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీటీసీ డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, న్యాయ సలహాదారులు వై.పరశురాం, డివిఓ ఎఓ వెంకట రమణ, సిఐలు జి.రాంబాబు, జె.మురళి, రాజశేఖర్, బి.వెంకటరావు, సిహెచ్. లక్ష్మణరావు, ఎస్.బాల సూర్యారావు, బి. నాగేశ్వరరావు, విజయనాధ్, ఎం.నాగేశ్వరరావు, జి.సంజీవరావు, హెచ్.ఉపేంద్రరావు, కే.రవికుమార్, ఎస్.సింహాద్రి నాయుడు, ఎల్.అప్పలనాయుడు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కోర్టుకు చేరిన కర్నాటక మహిళా బ్యూరోక్రాట్ల కేసు

Satyam NEWS

దూసుకుపోతున్న డర్టీ హరీ చిత్రం.. తొలిరోజే రికార్డు వ్యూస్..

Satyam NEWS

చెప్పకుండా మర్కజ్ వెళ్లివచ్చి గోప్యంగా ఉద్యోగంలో చేరి…

Satyam NEWS

Leave a Comment