33.2 C
Hyderabad
May 12, 2024 13: 27 PM
Slider నిజామాబాద్

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయింది

#shabbirali

గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని తేలిపోయిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కేటీఆర్ రహస్య ఢిల్లీ పర్యటనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కామారెడ్డిలోని తన నివాసంలో షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటి మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై హాట్ కామెంట్స్ చేశారు.

ప్రజలకు అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ వెళ్తున్నట్టు కేటీఆర్ చెప్పినా రహస్య ఏజండాతోనే కేటీఆర్ పర్యటన ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారన్నారు. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని పైకి ఆరోపిస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డిఫెన్స్ మంత్రిని కలవడం, హోంమంత్రి అమిత్ షాను కలవడానికి సిద్ధమవడం ఇందులో భాగమేనన్నారు.

ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ గాని కేటీఆర్ గానై ఏనాడైనా కలిసారా..? అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఏరోజైన ఆడిగారా అని నిలదీశారు. ఎన్నికలకు ముందు నెలల ముందు కేటీఆర్ ఢిల్లీ పర్యటన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలులో ఉంటే ఎమ్మెల్సీ కవిత బయట ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

ఇదే విషయంపై బీజేపీలోని ముఖ్య నాయకులే భిన్న వాదనలు వినిపిస్తున్నారని, పార్టీ సిద్ధాంతాలు నచ్చక ముఖ్య నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటనపై బండి సంజయ్ రాజకీయ కోణంలో చూడవద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కవిత అరెస్టుపై కేంద్రంలో ఒకమాట, రాష్ట్రంలో ఒక మాటపై నాయకుల్లో స్తబ్దత నెలకొందని, అందుకే ముఖ్య నాయకులే భిన్నంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ సిద్దాంతాలు, విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనేక మంది సిద్ధమవుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

గంప సవాలు స్వీకరిస్తున్నా.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మొన్నటి ప్రెస్ మీట్లో ఈ నెల 22 వరకు దశాబ్ది ఉత్సవాలలో బిజీగా ఉంటానని, 22 తర్వాత టేక్రియాల్ డబుల్ ఇళ్ల నాణ్యత పరిశీలనకు తేదీ చెప్పాలని సవాల్ చేసారని, గంప గోవర్ధన్ ఎప్పుడు సమయమిస్తే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని షబ్బీర్ అలీ తెలిపారు. టేక్రియాల్ వద్ద నిర్మించిన డబుల్ ఇల్లు నాసిరకంగా నిర్మించారని, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు.

లబ్ధిదారులకు ఇల్లు కేటాయించిన కూలిపోతాయన్న భయంతో ఇళ్లలోకి వెళ్లడం లేదన్నారు. నాణ్యత పరిశీలనకు మెస్త్రీలను తీసుకెళ్తే వారిని చిన్నచూపు చూస్తూ అవహేళన చేసి మాట్లాడిన ఎమ్మెల్యే మెస్త్రీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పునాదులు కట్టకుండా వాటికి మరమ్మత్తులు చేస్తున్నారని, మరమ్మత్తులు చేయకుండా వాటిని కూల్చేసి మళ్ళీ నిర్మించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. ఒకవేళ ప్రజలు ఆ ఇళ్లలోకి వెళ్తే ఇల్లు కూలినా, ఏదైన ప్రమాదం జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అన్నారు.

ఎమ్మెల్యే గంప చేసిన సవాలుకు తాను సిద్ధంగా ఉన్నానని, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందేమోనని పోలీసులు తనను అక్కడికి రానివకుండా చూస్తారని, పోలీసుల అనుమతి ముందే తీసుకుని ఎమ్మెల్యే ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఒక్కడినైన రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి రాజకీయం చేయడం లేదని, ఇతర నాయకులకు టికెట్ ఇప్పించే స్థాయిలో ఉన్నానని, తాను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడినని, పొలిటికల్ కన్వీనర్ గా ఉన్నానని తెలిపారు.

టికెట్ కోసం రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అశోక్ రెడ్డి, మద్ది చంద్రకాంత్ రెడ్డి, సందీప్, తదితరులు పాల్గొన్నారు

Related posts

స్వచ్ఛ సర్వేక్షన్ పై హుజూర్ నగర్ లో అవగాహన ర్యాలీ

Satyam NEWS

జనహిత శోభావళి

Satyam NEWS

బోస్టన్ కంపెనీపై విజయసాయిరెడ్డి అల్లుడి ఫ్రెండ్ ది

Satyam NEWS

Leave a Comment