27.7 C
Hyderabad
May 16, 2024 03: 37 AM
Slider వరంగల్

కేసీఆర్ జన్మదినం సందర్భంగా గట్టమ్మ దేవాలయంలో పూజలు

#gattamma

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పుష్కరించుకుని ఈ రోజు సాయంత్రం ములుగు జిల్లా సమీపంలోని శ్రీ గట్టమ్మ దేవాలయంలో గట్టమ్మ తల్లికి కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా ఇతర నాయకులు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ మాట్లాడుతూ ముందుగా 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ముఖ్య మంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు KCR కి జిల్లా ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో క్రియాశీలకంగా, రాజకీయంగా, అనేక విధాలుగా, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, అనేక రకాల ఉద్యమాలు చేసి చివరకు చావును సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కి ఆ దేవుళ్ళ ఆశీర్వాదాలు, దీవెనలు, శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ, గట్టమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు.

నేడు భారత రాష్ట్ర సమితి స్థాపించి దేశంలో రాజకీయాలలో ఒక గుణాత్మకమైన మార్పు కోసం నడుం బిగించారని అన్నారు. కేంద్రంలో ఉన్న  భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అస్తవ్యస్తంగా తయారుచేసి ప్రజల నడ్డి విరిచే విధంగా సామాన్యులు బతకలేని విధంగా చేసిందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అయితే సుపరిపాలన, సంక్షేమ పాలన ను అందిస్తున్నారో అదేవిధంగా యావత్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా అలాంటి పరిపాలన అందించాలని,అని రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదాలు, దీవెనలు ముఖ్యమంత్రి కి ప్రసాదించాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్  తో పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్, పాటు స్థానిక MPTC గొఱ్ఱె సమ్మయ్య, జాకారం సర్పంచ్ దాసరి రమేష్,సీనియర్ నాయకులు జలగం మోహన్ రావు, దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి (చిన్నా) చింతల పూడి నరేందర్ రెడ్డి, ములుగు మండల మైనారిటీ,ST,అదికార ప్రతినిధి రాజా హుస్సేన్, వంకుడోత్ రాం దాస్, ముడుతన పెళ్లి మోహన్, లియకత్ అలి, అజారుదిన్,నెరెళ్ల శంకర్ గజ్జి నగేష్,ప్రసాద్, కాసిం,వార్డు సభ్యులు బల్గురి నవీన్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

Hats off: భీమార్జున రెడ్డి గారూ…. మీ అంకితభావానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అనిల్ ఔట్ ?

Bhavani

హైకోర్టు జడ్జి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ

Bhavani

Leave a Comment