29.7 C
Hyderabad
May 3, 2024 04: 14 AM
Slider ప్రత్యేకం

నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అనిల్ ఔట్ ?

#MLA Anil

నెల్లూరు జిల్లా అధికార వైసీపీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల ను సస్పెండ్ చేయగా మరో ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై త్వరలో వేటు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైకాపా అధికారంలోకి రాగానే కీలక మైన ఇరిగేషన్ శాఖా మంత్రిగా పదవి చేపట్టి జిల్లా రాజకీయాలను శాసించిన అనిల్ కుమార్ పరిస్థితి పూలమ్మిన చోట కట్టెలమ్మిన చందంగా వుంది. అనిల్ సన్నిహితులు ఒక్కొక్కరూ దూరం అవుతున్నారు.

ఇప్పటికే సొంత బాబాయి రూప్ కుమార్‌ తో విభేదాలు వుండగా తాజాగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా అనిల్ ప్రత్యర్థి వర్గంలో చేరిపోయారు. అనిల్ .. బాబాయి రూప్ కుమార్‌ ల మధ్య సఖ్యత కుదిర్చెందుకు సీఎం స్యయంగా చేతులు కలిపించినా .. మనస్సులు కలవలేదు. అబ్బాయ్.. బాబాయ్ ల మధ్య విభేదాలు మరింత ముదిరిపోయి.

అబ్బాయ్ అనిల్ తో విభేదించిన బాబాయ్ రూప్ సొంత కార్యాలయాన్నే ఓపెన్ చేసాడు. బాబాయ్ బాబాయి రూప్ కుమార్‌ ను సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా ప్రోశ్చహిస్తున్నట్లు అనిల్ భావిస్తున్నాడు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ఎమ్మెల్యేల వర్క్ షాపు‌కు కూడా అనిల్ కుమార్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అనిల్ దాదాపు ఇరవై రోజుల తర్వాత జిల్లాకు వచ్చారు. పార్టీపై అనిల్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలతో అనిల్ సమావేశం కానున్నారు.

సొంత బాబాయి రూప్ కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన కార్యాలయం తీయించేయాలని, శ్రీకాంత్ రెడ్డికి పార్టీ పదవి తొలగించాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జిల్లాలో అధ్యక్షుడుగా తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ పెద్దలకి అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉన్నట్టు పార్టీలో జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. అనిల్ అల్టిమేటంకు సీఎం ఎలాంటి పరిస్తితుల్లోఅంగీకరించేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ పార్టీ నుంచి బయటకు పోవడమా లేక పార్టీ నుంచి ఉద్వాసన పలకడమా అన్నది త్వరలో తేలనుంది.

Related posts

తిరుప‌తిలో బీజేపీ గెలుపు ఖాయం..

Sub Editor

తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు?

Bhavani

జాతీయ అన్వేషిక ప్రయోగాల నైపుణ్య పరీక్షకు నమోదు చేసుకోండి

Satyam NEWS

Leave a Comment