34.7 C
Hyderabad
May 4, 2024 23: 57 PM
Slider మహబూబ్ నగర్

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నవంబర్ 26,27 డిసెంబర్ నెలలో 3,4 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటర్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహశీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. 2023 ఎన్నికల సంవత్సరం అయినందున 18 సంవత్సరాల వయస్సు పూర్తి ఆయిన ప్రతి యువతకు, ప్రతి వికలాంగులు, ట్రాన్సజెండర్లు ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో పెరు నమోదు చేయించేందుకు ఈ ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం, అవగాహన కల్పించాలని ప్రతి గ్రామంలో టామ్ టామ్ చేయించాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు బూత్ లెవల్ అధికారి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హాజరై ఫారం 6,7,8 లతో ఉండాలని ఆదేశించారు.

ఎవరైన ఉపస్థితి లేని పక్షంలో అట్టి బి.ఎల్. ఓ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బి.ఎల్.ఓ సూపర్వైజర్లు తమ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ లను తప్పనిసరిగా తిరిగి తహశీల్దారుకు నివేదిక ఇవ్వాలని, రహశీల్దార్లు తమ పరిధిలో ఈ.ఆర్.ఓ లు జిల్లా కలెక్టర్ సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి క్యాంపెయిన్ సజావుగా పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఆన్లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తులు వచ్చాయో జాబితా రూపొందించుకోవాలని అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో చనిపోయిన ఓటర్ల జాబితా సిద్ధం చేసుకొని తర్వాత విచారణ నిర్వహించి జాబితా నుండి పెరు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దివ్యంగులు జాబితా తయారు చేసి సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా ఈ పోలింగ్ స్టేషన్ లో బూత్ లెవల్ అధికారి లేరు అని ఫిర్యాదు రాకూడదని తెలియజేసారు. ఈ క్యాంపెయిన్ లో కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదులో పాటు, పోలింగ్ బూత్ మార్పు, నియోజకవర్గం మార్పు, ఇతరత్రా మార్పు చేర్పులు సైతం చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నందున ప్రజలు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు అదేవిధంగా డిసెంబర్ నెలలో 3,4 తేదీల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా బి.ఎల్.ఓ పోలింగ్ స్టేషన్ లో ఉపస్థితి లేదు అని తెలిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి ఉన్నందున అందులో మార్పు చేర్పులు చేసుకోదలచిన ఓటర్లు సైతం ఈ ప్రత్యేక క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు.

Related posts

కోవిడ్-19 నియంత్ర‌ణ‌లో ఫ్యాబ్రిక్ మాస్కు ఉత్త‌మం

Sub Editor

దళిత బంధు కాదు ఇది.. టీఆర్ఎస్ ధనవంతుల బంధువు

Satyam NEWS

నేలపాలైన 3000 లీటర్ల మద్యం

Sub Editor

Leave a Comment