కొల్లపూర్ లో గ్రంధాలయం, యోగ భవనాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ లోని విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు, ఉపయోగ పడే విధంగా గ్రంధాలయాన్ని అభివృద్ధి పరుస్తామని అన్నారు.
అలాగే యోగ భవనాన్ని కూడా ప్రారంభించి పట్టణంలోని మహిళలు యోగ చేసుకోవడానికి వీలు కలిగిస్తామని ఆయన అన్నారు. గ్రంథాలయం, మహిళలకు యోగా సెంటర్ ను ప్రారంభించినందుకు పట్టణం లోని మహిళలు అందరూ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియ జేశారు.
ఈ సందర్భంగా మహిళలు ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎంపీపీ గాదెల సుధారాణి, హాస్పిటల్ ఛైర్మెన్ కాటం జంబులయ్య, కొల్లపూర్ trs నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.