29.7 C
Hyderabad
May 3, 2024 05: 33 AM
Slider మహబూబ్ నగర్

రిలీఫ్ ఫండ్: విలేఖరి కుటుంబానికి ఆర్థిక సహాయం

mla kollapur

రాష్ట్రం లో ప్రజలు ఆరోగ్యకరంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్లు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈరోజు  కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామం లోని విలేఖరి కుటుంబానికి సీఎం కేసీఆర్ గారి  ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు.

గత సంవత్సరం మే నెలలో విలేఖరి  సి పి నాయుడు భార్య రాధ తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ఆ కుటుంబానికి ఆరు లక్షల సీఎం సహాయనిధి అందజేసి ప్రాణాలను కాపాడారు. మళ్లీ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం కేసీఆర్ సహాయనిధి నుండి వచ్చిన 2 లక్షల 50 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు.

ఆర్థిక కష్టాల్లో ఉన్న విలేకరి కుటుంబానికీ కి అండగా  నిలుస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వం కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు కృషి చేస్తుందన్నారు.

పేద వారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించి ప్రాణాలను నిలబెడుతోంది అని అన్నారు. దేశంలో, రాష్ట్రలలో, అమలు కాని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతాయన్నారు రైతుల సంక్షేమం కోసం  రైతు బంధు పథకం ప్రవేశపెట్టి రైతుల ఆత్మహత్యలను అరికట్టడం తో పాటు రైతులకు ఆత్మ బంధువుగా ఉన్నాడు అన్నారు. తెలంగాణలో బీడు వారిన పొలాలకు సాగునీరు అందించారన్నారు.  అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు కెసిఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఉందన్నారు కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి  సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ కొండ్ర బిచ్చయ్య, సింగిల్ విండో డైరెక్టర్ అభ్యర్థి పోనోగటి వెంకటేశ్వరరావు గ్రామ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Related posts

అత్యవసర పరిస్థితిలలో ఫోన్ చేయండి

Sub Editor

ప్రాణాలకు తెగించి బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్

Satyam NEWS

షూటింగ్ లో తీవ్ర ప్రమాదానికి లోనైన హీరో విజయ్ ఆంటోని

Bhavani

Leave a Comment