36.2 C
Hyderabad
May 7, 2024 12: 28 PM
Slider మహబూబ్ నగర్

హిందూ దేవుళ్లను కించ పరిచిన వ్యక్తులని అరెస్ట్ చేయాలి

హిందూ దేవి దేవతలని కించ పరిచేలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన భారత నాస్తిక సమాజం సంఘం రాష్ట్రఅధ్యక్షుడు బైరి నరేష్ పై, రెంజర్ల రాజేష్ పై చట్టపరంగాచర్యలు తీసుకోవాలని, పి.డి. ఆక్ట్ నమోదు చేయాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణం లోని రాజీవ్ చౌక్ లో ధర్నా చేశారు.

ఈ కార్యక్రమం లో హిందూ వాహిని పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ మాట్లాడుతూ అంబేత్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు అనే విషయం నాస్తిక సంఘం నాయకులు గమనించాలని, కేవలం సమాజం లో గొడవలు సృష్టించాలనే దురాలోచనతో డబ్బులకి ఆశ పడి హిందూ దేవి దేవతలని కించ పరిచేలా మాట్లాడి అల్పసంతోషన్ని కోరుకుంటున్నారని, ఇది చట్ట పరంగా తప్పు చేస్తున్నారని చెప్పారు.

దేశం అభివృద్ధిలో భాగంగా ప్రగతి పథంలో ముందుకు దుసుకుని పోతుంటే కొంత మందికి మాత్రం దేశాన్ని నాశనం చేయడానికి, మత ఘర్షణలు సృష్టించిడానికి కొంత మందిని డబ్బుల కోసం ఎర్పాటు చేసిన సభలో చరిత్రను వక్రీకరించ్చారని విమర్శించారు. శ్రీరాముడి పైన , విష్ణు పైన, శివుడుపై
తప్పుగా దురుసుగా అసభ్య పదజాలంతో మాట్లాడిన రాష్ట్ర బైరి నరేష్ ,రెంజల్ రాజేష్ అనే వ్యక్తులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని హిందూ వాహిని వనపర్తి శాఖ తరుపున డిమాండ్ చేశారు.

అంతే కాకుండా మళ్ళీ ఇలాంటివి సమాజం లో పునరావృతం కాకుండా వాళ్ళపైనా చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని, పి.డి. చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బైరీ నరేష్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమం లో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు గంజి నగేష్ గారు ,ప్రధాన కార్యదర్శి ముత్తు స్వామి, నరేందర్, అయ్యప్ప దీక్ష స్వాములు,హిందూ వాహిని పట్టణ అధ్యక్షుడు రోహిత్ కో కన్వీనర్ లు నంద, వెంకటేష్,చరన్, భరత్, అర్జున్, కార్తిక్, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ సీనియర్ విలేకరి సత్యం న్యూస్ నెట్

Related posts

పోలీస్ విజిల్: నాఖా చౌరస్తాలో పోలీసుల మాక్ డ్రిల్

Satyam NEWS

పుతిన్ తో చర్చలు జరిపిన అజిత్ దోవల్

Satyam NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీసు కవాతు ప్రాక్టీస్

Satyam NEWS

Leave a Comment