29.7 C
Hyderabad
May 4, 2024 05: 26 AM
Slider మహబూబ్ నగర్

పేదల కడుపు కొడుతున్న తెలంగాణ ప్రభుత్వం

#BJP Narayanpet

కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా కరోనా సమయంలో పేదలను ఆదుకోవడం కోసం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బియ్యం పంపిణీలో కోత విధిస్తూ పేదల కడుపు కొడుతుందని నారాయణపేట జిల్లా బిజెపి లీగల్ సెల్ అద్యక్షులు నందు నామా జి ఒక ప్రకటనలో విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం మే నుంచి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో ఇవ్వకుండా జూన్ నెలలో రెండు కలిపి 20 కిలోలు ఇవ్వాల్సి ఉన్నా జూన్ లో 5 కిలోలు కోత పెట్టీ 15 కిలోలు మాత్రమే పంపిణీ చేసిందన్నారు.

జూన్ లో మిగిలిన 5 కిలోలు మాత్రమే జూలై కోటా గా ఇవ్వాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పేదల కడుపు కొట్టడమే అన్నారు. కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించాలని తగిన బుద్ది చెప్పాలని కోరారు.

Related posts

శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రం మెలోడి సాంగ్ ‘నిను చూశాక..’ విడుదల

Satyam NEWS

ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా కంపించిన భూమి

Satyam NEWS

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ’ఎవోల్’ (EVOL)

Bhavani

Leave a Comment