27.7 C
Hyderabad
May 16, 2024 06: 36 AM
Slider రంగారెడ్డి

సిబిఐటి కళాశాల లో గ్రాండ్ గా ముగిసిన  సుధీ 2023

#sudhee

సిబిఐటి కళాశాల లో జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్  సుధీ 2023 ఘనంగా జరిగింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగిన ఈ జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ ద్వారా వివిధ కళాశాల విద్యార్థులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలను అవగాహన చేసుకున్నారు.

విద్యార్ధులకు సాంకేతిక, పారిశ్రామిక, కార్పొరేట్ నిపుణులతో సంభాషించే అవకాశం దొరికింది. ముగింపు  కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ  విద్యార్థులకు ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. సుదీ 2022 చైర్ పర్సన్ ప్రొఫెసర్ కే రాధిక మాట్లాడుతూ సి బి ఐ టి విద్యార్థులు 5,000 మంది, ఇతర కళాశాల నుంచి సుమారు గా 2000 మంది విద్యార్ధులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.

ఐటి  విభాగం టెక్స్ట్ సీ

సుధీ 2023 లో భాగం గా ఐటి  విభాగం టెక్స్ట్ సీ  నిర్వహించింది. విభాగ అధిపతి ప్రొఫెసర్ కే  రాధిక, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ రాము కూచిపూడి, డాక్టర్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో 16 కార్యక్రమాలు జరిగాయి.  ఇతర రాష్ట్ర కళాశాలల నుండి  ప్రధాన 3 ఈవెంట్‌ల కోసం  ప్రాజెక్ట్ ఎక్స్‌పో, టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్‌ కు  579 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.

కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం సుధీ 2023లో భాగంగా హెడ్‌స్టార్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. విభాగ అధిపతి ప్రొఫెసర్ వై రమాదేవి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు రమణ రెడ్డి, మోహన్ ఆధ్వర్యంలో 12 కార్యక్రమాలు జరిగాయి.  సుమారు 1200 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సుధీ 2023లో భాగంగా టెకియాన్‌ని నిర్వహించింది. విభాగ అధిపతి డాక్టర్ బి ఇందిర, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు పొన్నాల రమేష్, ఎం కాళిదాస్ ఆధ్వర్యంలో 10 కార్యక్రమాలు జరిగాయి. సుమారు 450 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.

ఈసీఈ  విభాగం సుధీ  2023 లో భాగం గా సినప్స్  ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.  విభాగాధిపతి విభాగ అధిపతి ప్రొఫెసర్  డి.కృష్ణా రెడ్డి, ముగింపు  కార్యక్రమానికి హైదరాబాద్‌లోని ఇస్రోలోని ఐసీఐజీ/డీఏపీ/ఎన్‌ఆర్‌ఎస్‌సీ గ్రూప్ హెడ్ సైంటిస్ట్-ఎస్జీ డాక్టర్ జి. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  “ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లలో పురోగతి మరియు శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ల కోసం దాని వినియోగం.” అనే అంశం మీద ఆయన ప్రసంగించారు. వివిధ టెక్నికల్ క్లబ్‌లు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మొత్తం 650 మంది విద్యార్ధులు పాల్గొన్నారు.

ఎలక్ట్రికల్  విభాగం ఎలక్ట్రిక్‌

సుధీ 2023లో భాగంగా ఎలక్ట్రికల్  విభాగం ఎలక్ట్రిక్‌ను నిర్వహించింది. విభాగ అధిపతి ప్రొఫెసర్ జి సురేష్ బాబు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ఎన్ సంతోష్ కుమార్, సి శ్రీశైలం  ఆధ్వర్యంలో 10 కార్యక్రమాలు జరిగాయి. సుమారు 450 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. సుధీ  2023లో భాగంగా కెమికల్  విభాగం కెమ్ స్పార్క్  ను  నిర్వహించింది. విభాగ అధిపతి డాక్టర్ నాగ ప్రపూర్ణ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎమ్ ముకుంద వాణి, డాక్టర్ ఆర్ ప్రసన్న రాణి ఆధ్వర్యంలో 10 కార్యక్రమాలు జరిగాయి.  సుమారు 400 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్ చెర్లపల్లి సి ఐ పి ఈ టి చీఫ్ మేనేజర్ వి. కిరణ్ కుమార్ ముఖ్య అతిది గా విచ్చేసారు.

బయో టెక్నాలజీ  విభాగం నియో జియాన్

సుధీ  2023లో భాగంగా బయో టెక్నాలజీ  విభాగం నియో జియాన్ ను  నిర్వహించింది. విభాగ అధిపతి డాక్టర్  రాజశ్రీ   ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ఎస్ సుమిత్ర డాక్టర్ బి సుమిత్ర  ఆధ్వర్యంలో 10 కార్యక్రమాలు జరిగాయి. సుమారు 400 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. డాక్టర్ ఆంజనేయులు , డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, జె ఎన్ టి యూ  హైదరాబాద్ ముఖ్య అతిధి గా  హాజరయ్యారు. సుధీ  2023లో భాగంగా స్కూల్ అఫ్ మేనేజ్మెంట్  స్టడీస్  యుక్తి ని  నిర్వహించింది. విభాగ అధిపతి డాక్టర్  ఎస్ సరస్వతి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు  ఆధ్వర్యంలో 15 కార్యక్రమాలు జరిగాయి.  సుమారు 400 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.  ముగింపు కార్యక్రమానికి అతిథిగా డైరెక్టర్ తేజస్వి గ్రీన్ ఎనర్జీ జతిల్ శర్మ విచ్చేసారు.

సుధీ  2023లో భాగంగా మెకానికల్  విభాగం మెకానిక  ను  నిర్వహించింది. విభాగ అధిపతి ప్రొఫెసర్ పి వి ఆర్ రవీందర్ రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డి రవి, జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 10 కార్యక్రమాలు జరిగాయి. సుమారు 400 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. సుధీ  2023లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్   విభాగం సివిలిజషన్స్ ను నిర్వహించింది. విభాగ అధిపతి ప్రొఫెసర్ కె జగన్నాధ రావు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు  డాక్టర్ రంజన్, డాక్టర్ దాస్ ఆధ్వర్యంలో 10 కార్యక్రమాలు జరిగాయి.  సుమారు 400 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.

Related posts

బీ అలెర్ట్:సహకార ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు

Satyam NEWS

పనులు త్వరగా పూర్తి కావాలి

Bhavani

Leave a Comment