31.7 C
Hyderabad
May 2, 2024 07: 44 AM
Slider కరీంనగర్

బీ అలెర్ట్:సహకార ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు

sp rahul hegde elections

రాజన్నసిరిసిల్ల జిల్లా లో 13 మండలాలలో ఉన్న 24 సహకార సంఘాల కి ఈ నెల 15 న ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాజన్న సిరిసిల్ల ఎస్.పి శ్రీ రాహుల్ హెగ్డే తెలిపారు.ఆదివారం అయన జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడుతూ సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి నిర్వహణ, వార్డుల వారీగా పోలింగ్ బూతులు ఉన్న ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్ల గురించి అయన స్థానిక పోలీస్ సిబ్బంది తో పర్యవేక్షించారు.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక మేరకు అధికారులు మరింత వేగంగా ముందుకు వెళ్లాలని, చట్టవ్యతిరేక చర్యలు, సంఘ విద్రోహుల కదలికల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీస్ లను ఆదేశించారు. ప్రచారం నిర్వహించే కాలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లపై ఎస్.పి. పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రతి పోలీసు అధికారి నియమనిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కృషి చేయాలని వివరించారు.

ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఏమాత్రం ఏమరుపాటు తగదని, శాంతియుతంగా, స్నేహపూరితంగా, చట్టపరిధిలో బందోబస్తు నిర్వహించే క్రమంలో మంచి పేరు సంపాదించుకున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు మరోసారి విశిష్టతను నిలుకుందామని ఈ సందర్భంగా ఎస్.పి.అధికారులకు పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగేందుకు, పోలీసుల బందోబస్తుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఎస్.పి. కోరారు. 24 వార్డ్ లలో 309 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయడం జరిగింది.

ఇప్పటి వరకు నర్సింగపూర్ సహకార సంగం ఏకగ్రీవం కావడం తో అక్కడ మినహాయించి,జిల్లా లో ఎన్నికల సమయంలో అక్రమ మద్యం అమ్మకం లేదా నగదు లేదా ఇతర వస్తువుల పంపిణీపై దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని ఎక్కడ కూడా తప్పుడు పద్ధతులను ఉపయోగించి ఓటర్లను లేదా అభ్యర్థులను ప్రభావితం చేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదాని లేకుంటే కఠిన చర్యలు తప్పవని అయన హెచ్చరించారు.

Related posts

‘మలుపు’తో పద్మజ లంకా గెలుపు

Satyam NEWS

Corona Virus: ఐదు వ్యాక్సిన్ లలో ఒకదానికి అత్యవసర అనుమతి

Satyam NEWS

కొమురవెల్లి మల్లన్నకు బంగారు మీసాలు సమర్పించిన మంత్రి అల్లోల

Satyam NEWS

Leave a Comment