Slider కరీంనగర్

డౌట్ రైజ్డ్:అనుమాన స్పద స్థితిలో వ్యక్తి మృతి

suspected death

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం కలికోట శివారులోని చెరువు వైపు వెళ్లే దారికి సమీపంలో అనుమాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతిచెందాడు. మృతదేహాన్ని చూసిన ఓ రైతు గ్రామస్థులకు సమాచారం అందించాడు. విషయాన్ని తెలుసుకున్న కలికోట, రుద్రంగి గ్రామస్థులు తండోపతండాలుగా శవాన్ని చూడటానికి వచ్చారు.

స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి దర్యాప్తు చేసి చూస్తే గానీ అది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం తెలిసేలా లేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మృతుడు వేములవాడ మండల శాత్రాజిపల్లి గ్రామానికి చెందిన ఏనుగుమల్లారెడ్డి గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కొల్లాపూర్ విద్యుత్ ఏఈ నిర్లక్ష్యంతో ప్రజలకు షాక్

Satyam NEWS

ఆటోవాలాలకు మున్సిపల్ చైర్మన్ ఆర్ధిక సాయం

Satyam NEWS

నాలుగు నెలల్లో ముదిరాజ్ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి

Satyam NEWS

Leave a Comment