28.7 C
Hyderabad
May 5, 2024 08: 34 AM
Slider హైదరాబాద్

టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల

#tatamotors

టాటా మోటార్స్ సరికొత్త నెక్సాన్ ఈవీ మాక్స్‌ ఎలక్ట్రిక్ ఎస్‌.యూ.వీ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా వెంకటరమణ మోటార్స్ గచ్చిబౌలి షోరూమ్‌లో ఈ కొత్త నెక్సాన్ ఈవీ మాక్స్‌ ఎలక్ట్రిక్ ఎస్‌.యూ.వీ కారును టీ.ఎస్.రెడ్కో వైస్ ఛైర్మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్య, టాటా వెంకటరమణ మోటార్స్ మానేజింగ్ డైరెక్టర్ వివి రాజేంద్రప్రసాద్‌లు కలిసి మార్కెట్లోకి విడుదల చేసారు.

ఈ సందర్భంగా వివి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లలో నెక్సాన్ ఈవీ విడుదలైన దగ్గర్నుంచి గ్రాండ్ సక్సెస్‌తో ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలుసు..ఇక ఈ సక్సెస్‌ జర్నీని కంటిన్యూ చేస్తూ మరికొన్ని కొత్త ఫీచర్స్‌తో అలాగే ఎక్కువ రేంజ్‌తో ఈ కొత్త నెక్సాన్ ఈవీ మాక్స్‌ ఎలక్ట్రిక్ ఎస్‌.యూ.వీ కారును టాటా మోటార్స్ విడుదల చేయడం,అలాగే ఇక్కడ మన టాటా వెంకటరమణ మోటార్స్ గచ్చిబౌలి షోరూమ్‌లో కస్టమర్లకు అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కొత్త ఈవీ మాక్స్‌లో రేంజ్‌ని పెంచడంతో సేల్స్‌ ఇంకా పెరిగే అవకాశం ఉందని,ఇక్కడ టాటా వెంకటరమణ షోరూమ్‌లో నెక్సాన్ ఈవీ మాక్స్‌ ఎలక్ట్రిక్ ఎస్‌.యూ.వీ కారును విడుదల చేయడం సంతోషంగా ఉందని, టీ.ఎస్.రెడ్కో వైస్ ఛైర్మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్య మీడియాకు తెలిపారు. 50 నిమిషాల్లో 80% చార్జ్ అయ్యే ఈ కారుని ఒక్క సారి ఫుల్ చార్జ్‌ చేస్తే 437 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 8 సంవత్సరాలు లేదా ఒక లక్షా అరవై వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ మరియు మోటార్‌పై వారంటీని ఈ కార్‌ కలిగిఉంది.

140 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌ కలిగిఉన్న ఈవీ మాక్స్ 9 సెకన్లలో 0 టూ 100 కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకోగలదు.ఇంకా ఇందులో ఎ.బి.ఎస్ విత్ ఈ.బీ.డీ మరియు బ్రేక్ ఎసిస్ట్,ఆటో వెహికిల్ హోల్డ్,ఐసోఫిక్స్ యాంకరేజ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.అలాగే,బ్యాటరీ మరియు మోటార్‌పై ఐ.పి67 రేటింగ్‌ని కలిగిఉంది.ఇంకా ఇందులో సన్‌రూఫ్,వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్,కనెక్టెడ్ ఫీచర్స్‌ని కూడా అందిస్తున్నారు.

టాటా మోటార్స్ సరికొత్త నెక్సాన్ ఈవీ మాక్స్‌ ఎలక్ట్రిక్ ఎస్‌.యూ.వీ కారు 17లక్షల 74వేల బేసిక్ ఎక్స్‌షోరూమ్‌ ప్రైజ్‌తో అన్ని టాటా వెంకటరమణ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్ టెర్రిటరీ ev sales manager ch రిచర్డ్, షోరూమ్ సీఈఓ మహేందర్, షోరూమ్ జీ.ఎం రవీంద్ర మరియు షోరూమ్ సిబ్బంది కస్టమర్లు పాల్గొన్నారు.

Related posts

అగ్నిప్రమాదాల నివారణ పై అవగాహన ఉండాలి

Bhavani

కొత్త సినిమా విడుదల రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే నేరుగా చూసే అవకాశం

Bhavani

ఓట్ల పండగ

Satyam NEWS

Leave a Comment