29.7 C
Hyderabad
May 3, 2024 06: 40 AM
Slider కవి ప్రపంచం

ఓట్ల పండగ

#Devalapally Sunanda

పండగ వచ్చిందోయ్…
పండగ వచ్చింది
ఐదేళ్లకోసారి వచ్చే
ఓట్ల పండగ వచ్చింది
వీధి వీధిలో సందడి తెచ్చింది
నాయకులంతా
వంగి వంగి దండాలు పెడుతూ
కనిపించిన ప్రతీవాడి
భుజంపై చెయ్యేసి
మనవాడే మన చుట్టమే
అన్నట్టుగా
మాటలమంత్రాలు వేస్తూ
ఓటు నాకే వెయ్యాలంటూ
చేతిలో చెయ్యేసి చెప్తూ
ఎవరికి కనిపించకుండా
నోటు చేతిలో పెట్టి
రాజకీయ తంత్రాలు
నడుపుతున్నారు
అందరిలోకి తామే మంచోళ్ళు
ఎదుటి పార్టీలు మోసగాళ్లంటూ
అయోమయంలో పడేస్తారు
ఓ ఓటరన్నా.. జర జాగో
చల్లగా సేదతీర్చే మంచు ఏదో
కణకణ మండే నిప్పు ఏదో తేల్చుకో
మంచి ఏదో మనసుతో ఆలోచించుకో
రేపటి ప్రభుత్వానికి
వంగి వంగి దండాలు పెట్టాలో
తప్పుచేస్తే తప్పుకోమని నిగ్గదీయగల్గాలో
నిర్ణయం నువ్వే తీసుకో
నీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకో

దేవలపల్లి సునంద
9291599562

Related posts

(CVS) Best Weight Loss Supplement Pills Baishi Pills To Lose Weight

Bhavani

టెర్రర్:మార్కెట్లో బాంబు పేలి 30 మంది మృతి

Satyam NEWS

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు

Satyam NEWS

Leave a Comment