30.7 C
Hyderabad
April 29, 2024 07: 00 AM
Slider వరంగల్

ములుగులో నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం

#mulugubjp

నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకం తగ్గించటం సాహసోపేతమైన నిర్ణయమని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు జిల్లా కేంద్రంలోని పెట్రోల్ పంప్ లో బీజేపీ ములుగు మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.

ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వళ్ళ వాహనదారులకు, రైతులకు ఎంతో ఉపశమనం లభించిందని అన్నారు. అలాగే వంట గ్యాస్ విషయంలో కేంద్రం ఉజ్వల పతకం వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ పై రూపాయలు 200 రాయితీ ఇవ్వటతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరట ఇచ్చిందని అన్నారు.

గ్యాస్ సిలిండర్ పై రాయితీతో తెలంగాణాలో 13 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై రాయితీ ప్రకటించటంతో రైతుఫులకు ఎంతో ఉపశమనం కలిగిందని అన్నారు. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకం తగ్గించి వాహన దారులను, రైతులను ఆదుకోవాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేలా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శీలమంతుల రవీంద్ర చారీ, జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డ్ వాసుదేవ రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజు, మండల ఉపాధ్యక్షులు బైకని రాజశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు అన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి, బాణాల రాజ్ కుమార్, దేవిరెడ్డి ఇంద్రసేన రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కల్లేపల్లి ప్రవీణ్,బీజేవైఎం మండల అధ్యక్షులు కనుకుల అవినాష్, నాగసాయి,  దాసు ప్రవీణ్, పెట్రోల్ పంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంఎల్ సి కవితతో తెలంగాణ జాగృతి నేతల భేటీ

Satyam NEWS

హెల్మెట్ ధరించి ప్రాణం కాపాడుకోండి

Satyam NEWS

లీవ్ ఫర్ టుడే: సిబిఐ కోర్టుకు నేడు జగన్ రావడం లేదు

Satyam NEWS

Leave a Comment