40.2 C
Hyderabad
May 2, 2024 15: 16 PM
Slider ఖమ్మం

అగ్నిప్రమాదాల నివారణ పై అవగాహన ఉండాలి

#fire prevention

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. ఐడిఓసి లోని అదనపు కలెక్టర్ చాంబర్ లో అగ్ని మాపక వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖచే అగ్ని ప్రమాదాలు, జాగ్రత్తలు, సూచనలపై రూపొందించిన కరపత్రాలను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఐడిఓసి లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిప్రమాదం వంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ఉద్యోగులకు తగు సూచనలు చేశారు. వేసవికాలం కావడంతో అకస్మాత్తుగా సంభవించే అగ్నిప్రమాదాల నివారణపై సిబ్బందిని సమాయత్తం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఎఫ్ఓ జయప్రకాష్, ఏడిఎఫ్ఓ రేమాండ్ బాబు, ఎస్ఎఫ్ఓ రాజేశ్వర రావు, కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

Related posts

శరణు ఘోష తో మార్మోగిన ములుగు రామాలయం

Satyam NEWS

సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి: ముగ్గురి మృతి

Satyam NEWS

వర్గీకరణ తోనే షెడ్యూల్ కులాలకు న్యాయం

Bhavani

Leave a Comment