Slider మహబూబ్ నగర్

గణపసముద్రం చెరువులో మంచినీటి రొయ్యల విడుదల

niranjan 25

తెలంగాణ ప్రజలకు చేపలతో పాటు రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లా ఘణపురం గణపసముద్రం చెరువులో లక్షా 10 వేల నీలకంఠ మంచినీటి రొయ్యల విడుదలను నేడు ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ శ్వేతా మొహంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశమున్న అన్ని చెరువులలో దశలవారీగా రొయ్యలు విడుదల చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో వట్టిపోయిన చెరువులు ఇప్పుడు అలుగు పారుతున్నాయని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం అని అన్నారు. ఉచిత చేప పిల్లల విడుదలతో మత్య్యకార కుటుంబాలలో ఆర్థిక స్వావలంబన వచ్చిందని ఇదే విధంగా  కేసీఆర్ ముందుచూపుతో అన్ని రంగాలలో  ప్రగతి సాధిస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చామని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి అన్నారు.

Related posts

దండకారణ్యంలో కరోనాతో పది మంది మావోల మృతి

Satyam NEWS

విజయనగరంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ ముగింపు

Satyam NEWS

బీఆర్ఎస్ ను మిత్రపక్షంగా చూడటం లేదు: ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ

Satyam NEWS

Leave a Comment