35.2 C
Hyderabad
April 27, 2024 13: 25 PM
Slider ముఖ్యంశాలు

బీఆర్ఎస్ ను మిత్రపక్షంగా చూడటం లేదు: ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ

#aap

బీఆర్ఎస్ పార్టీని తాము మిత్రపక్షంగా చూడటం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు దిడ్డి సుధాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఆప్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు దిడ్డి సుధాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నందున ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సమాయత్తం అవుతోందని, అందులో భాగంగా జిల్లాల వారిగా పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో, దేశంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అవినీతి, లిక్కర్ స్కామ్ పేరుతో విచారణ చేస్తూ అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈరోజు కూడా విచారణ పేరుతో గదిలో బంధించారన్నారు. అసలు లిక్కర్ స్కామ్ అంటేనే ఎవరికి తెలియదని, ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదని పేర్కొన్నారు.

సిబిఐ, ఈడి, ఐటిలతో బీజేపీ బెదిరిస్తోందని, 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోలి గద్దెనెక్కిందని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ కు మెజారిటీ ఉన్నా అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తే కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. అప్పులు లేకుండా ప్రజలు కట్టే పన్నులతోనే ఢిల్లీ ఆప్ సర్కార్ పాలన సాగిస్తోందని, ఇదే విధానాన్ని దేశమంతా విస్తరించాలన్నదే ఆప్ లక్ష్యమన్నారు. దేశభక్తి, మతోన్మాదం పేరుతో కేంద్రంలోని బీజేపీ రెండు భాగాలుగా దేశాన్ని విభజిస్తుందన్నారు.

తాము మతాలకు వ్యతిరేకం కాదన్నారు. కేజ్రీవాల్ ను ప్రధానిగా చేయడానికి అన్ని పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మాకు రెండవ శత్రువని, బీఆర్ఎస్ ను మేము మిత్రపక్షంగా చూడటం లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. బీజేపీని గద్దె దించడానికి బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలతో కలుపుకు పోతామన్నారు.

రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని, రాష్ట్రానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఆమె అవినీతి అక్రమాలకు పాల్పడిందని తెలిసి పార్టీ అధిష్టానమే ఆమెను తొలగించాలనుకుందని, ఆలోపు ఆమెనే పార్టీకి రాజీనామా చేసిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు రామాగౌడ్, జిల్లా నాయకులు మదన్ లాల్, రవి, అహ్మద్, రహమాన్, గఫార్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పాకిస్తాన్  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

పిండ ప్రదానాలు చేయించే పురోహితులకు సూచన

Satyam NEWS

ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

Bhavani

Leave a Comment