38.2 C
Hyderabad
May 3, 2024 20: 56 PM
Slider ఖమ్మం

మేదావుల పై నల్లచట్టాల ప్రయోగం న్యాయం కాదు

#Prof. Haragopal

తెలంగాణా రాష్ట్రం గర్వించదగ్గ మేదావి , గత 30 సం పైగా అనేక విశ్వవిద్యాలయల లో తన ప్రసంగాల ద్వారా చైతన్య పరుస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ , ప్రా॥ కాశీం లాంటి వేదావులను నల్ల చట్టాల పేరుతో నోరు మూయించాలని చూడటం న్యాయం కాదని చైతన్య వేదిక , స్పర్శ అధ్యయన వేదికల బాద్యులు తాళ్ళురి వేణు , కాకి బాస్కర్ అన్నారు .

అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన అనంతరం మాట్లాడుతూ మహిళా ఉద్యమ నాయకులు ఆయన సంధ్య , అరుణోదయ విమలక్క , పద్మజషా తదితరులు152 మంది పై , ఇతరులపై రాజద్రోహ చట్టం (ఉపా) ప్రయోగిస్తూ FIR విడుదల చేయటాన్ని నిరసిస్తూ స్థానిక అంబేష్కర్ విగ్రహం వద్ద ప్రజాస్వామ్య , రాజ్యాంగ రక్షణ కావాలని ప్రదర్శన నిర్వహించారు .

అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అనేక మంది మేదావులను , విద్యావేత్తలను , ఉద్యమకారులను బ్రిటిష్ కాలం నాటి నల్లచట్టాలు ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని , అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికే రక్షణ లేకుండా పోతున్నదని వాపోయారు . మేధావులు అణిచివేత ఏమాత్రం న్యాయం కాదని అన్నారు .

న్యాయం కోసం పోరాడే వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని సామాజిక బాధ్యతను మరచిపోతే భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు . తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ముందు ఈ చట్టాన్ని ఎందుకు ముందుకు తీసుకు వొస్తున్నారో ప్రజలు , మేథావులు , విద్యార్థులు అర్థం చేసుకోవాలని అన్నారు .

సమాజ శ్రేయస్సు కోసం పని చేసేవారిని రక్షించు కోవలసిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని , హరగోపాల్ , కాశీం, సంద్య , విమల తదితర 152 మంది పై పెట్టిన ఉపా కేసును వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రేసీ జిల్లా నాయకులు గిరి , శోభ , హన్మంతరావు , సురేష్ , పిడిఎసు నాయకులు మస్తాన్ , శ్రీకాంత్ , టీపీటీఫ్ రాష్ట్ర నాయకులు చెల్ది బాబురావు , వెంకట్ నారాయణ , ప్రసాద్ , పూర్ణచందర్ రావు, శ్రీకాంత్ తెలంగాణా ఉద్యమకారులు సురేష్ , పార్టీ గాయకులు తేజ , క్రాంతి , అనంత వచ్చునాయక్ , యాకుబ్ , తిమ్మిడి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు .

Related posts

వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనం కొల్లు రవీంద్ర అరెస్ట్

Satyam NEWS

జగనన్న భవిష్యత్తు కాదు… సామాన్య ప్రజలకు విపత్తు

Satyam NEWS

మద్యం అక్రమంగా తరలిస్తున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

Leave a Comment