27.7 C
Hyderabad
May 16, 2024 04: 40 AM
Slider రంగారెడ్డి

షాపింగ్ మాల్స్ లో అవసరమైనంత పార్కింగ్ ఉండాలి

#DCP T Srinivasa Rao

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో, ట్రాఫిక్, లా & ఆర్డర్ పోలీసు అధికారులతో ఈరోజు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి శ్రీనివాస రావు, సైబరాబాద్ సీపీ ఆఫీస్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి యాజమాన్యం మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా ఎంట్రీ మరియు ఎగ్జిట్లు స్పెసిఫికేషన్ల ప్రకారం ఉండి పార్కింగ్ ప్రదేశం క్రమపద్ధతిలో ఉండాలన్నారు.

అన్ని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సహకారం అందిస్తేనే ట్రాఫిక్ నియంత్రణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం మాదపూర్ డీసీపీ, శిల్పవల్లి మాట్లాడుతూ ఆయా ఏరియాలకు సంబంధించిన సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉంచుకొని ఏవైనా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, మాదపూర్ డీసీపీ శిల్పవల్లి ఏడీసీపీ నర్సింహా రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్లు, ఇతర ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

వినాయక మండపాలకు అనుమతి నిరాకరణ పై భజరంగ్ దళ్ నిరసన

Satyam NEWS

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

Satyam NEWS

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

Satyam NEWS

Leave a Comment