29.7 C
Hyderabad
May 4, 2024 04: 01 AM
Slider అనంతపురం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

#nagalaxmiias

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకుముందుకొచ్చే ఔత్సాహికపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని  మినీ కాన్ఫెరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ది చెందుతుందని జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సింగల్ విండో పోర్టల్ నందు జనవరి, ఫిబ్రవరి లో 110 దరఖాస్తులు రాగా అందులో 93 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించామని తెలిపారు. 17 దరఖాస్తులను కూడా పెండింగులేకుండా గడువు తేదీ లోపల ఆమోదించాలని జిల్లా కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు మరియు భూగర్భ జల శాఖల  అధికారులను జిల్లా కలెక్టర్  ఆదేశించారు. జిల్లాలో 2015-20  ఇండస్ట్రియల్ పాలసీ నందు 6 యూనిట్లు రూ. 6.40 లక్షలు,  2020-23 ఇండస్ట్రియల్ పాలసీ నందు 5 యూనిట్లకు గాను 10.22 లక్షల రూపాయలు, YSR జగనన్న బడుగు వికాసము క్రింద 42 యూనిట్లకు 651.63 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరు కు కలెక్టర్ ఆమోదం తెలిపారు. వివిధ కారణాలవల్ల 4 యూనిట్లకు సంబంధించి 5 క్లెయిమ్స్ ను తిరస్కరించడం జరిగిందన్నారు.

నూతన పారిశ్రామిక విధానం 2023-27 గురించి జిల్లా కలెక్టర్ సభ్యులందరికి పరిశ్రమల శాఖ అధికారి జి.నాగరాజ రావు వివరించారు. నూతన పారిశ్రామిక విధానము విధి విధానాలు ప్రభుత్వం నుండి విడుదల అయిన తరువాత అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. PMEGP 2022-23 ఆర్థిక సంవత్సరం నందు 770 దరఖాస్తులను వివిధ బ్యాంకులకు పంపించగా, నిర్దేశించిన 284 యూనిట్లు గాను 175 యూనిట్లు రూ.664.00 లక్షల మార్జిన్ మనీతో గ్రౌండింగ్ అయ్యాయని,51 యూనిట్లకు రూ.185.00 లక్షల మార్జిన్ మనీ మంజూరు వివిధ దశలలో ఉన్నాయన్నారు.

మార్చి 3,4 తేదీల్లో రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ని నిర్వహించిందని, ఈ సదస్సులోఅనంతపురం జిల్లాలో 2 యూనిట్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వముతో MOU చేసుకున్నాయన్నారు. వాటిలో Posspole Private Limited వారు రూ.275 కోట్లు పెట్టుబడి విలువతో 2500 మందికి ఉపాధి లక్ష్యంగా Eco Steel India Limitedవారు రూ.554 కోట్ల పెట్టుబడి విలువతో 500మందికి ఉపాధి లక్ష్యంగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చారన్నారు.

ఈ సందర్భముగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే  ఈ పరిశ్రమలకు అవసరమైన అనుమతులను సత్వరముగా మంజూరు చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమ వారికీ ఏవైనా ఇబ్బందులు ఉంటె DIEPC కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమీక్షలో LDM  నాగరాజా రెడ్డి,DCIF కేశవులు,  FAPCCI శేషాంజనేయులు ,  FAPSIA నాగరాజు, ZM APIIC మురళీమోహన్,  APSFC బ్రాంచ్ మేనేజర్ ప్రకాష్,రీజినల్ రవాణా శాఖ అధికారి సురేష్ నాయుడు, పారిశ్రామిక సంఘాలప్రతినిధులు (DICCI, SSCCI,TICCI & DIA) Eco Steel యాజమాన్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్ బి ఐ లోకి చొరబడ్డ దొంగలు: లాకర్ నుంచి సొమ్ము చోరీ

Satyam NEWS

లెక్కలతో రాజకీయ ఐఖ్యత సాధ్యం కాదు

Bhavani

భారతీయ సాంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ

Satyam NEWS

Leave a Comment