30.7 C
Hyderabad
May 5, 2024 04: 04 AM
Slider ముఖ్యంశాలు

ఒక్కటయ్యారు

#congress

రాహుల్‌ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా గాంధీభవన్‌లో ఒక రోజు దీక్షకు దిగాయి. వర్గాలు, గ్రూపులు, సీనియర్లు-జూనియర్ తేడా లేకుండా పార్టీ నేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే సహా రాష్ట్ర నాయకులందరూ భిన్నాభిప్రాయాలు, విభేదాలను పక్కనపెట్టి హాజరయ్యారు. యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ నల్ల చొక్కలతో దీక్షకు హాజరయ్యారు. మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ సైతం గాంధీ భవన్‌కు వచ్చారు. తన సొంత ఇంటికి వెళ్ళినదానికంటే సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో తనను చేర్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా వచ్చానని, రాహుల్‌గాంధీ వ్యవహారంతో దీక్షలో పాల్గొంటున్నట్లు వివరించారు. నేతలు మాట్లాడుతూ రాహుల్‌గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ చర్య తీసుకోవడం బీజేపీ పథకం ప్రకారం ఆడిస్తున్న డ్రామా అని వ్యాఖ్యానించారు. అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలంతా మూకుమ్మడిగా ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని, ఇప్పటికే పార్టీలో ఈ దిశగా ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని తెలిపారు. రాహుల్‌గాంధీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Related posts

ఎస్వీ వేద వ‌ర్సిటీలో శాస్త్రోక్తంగా శ్రీ వ‌టసావిత్రి వ్ర‌తం

Satyam NEWS

సొంత వారినే కాటేస్తున్న జే -మాఫియా..!

Satyam NEWS

స్వామిజీల‌ను కొనుగోళ్ళ ప‌ర్వంలోకి దింప‌డం సిగ్గు చేటు

Bhavani

Leave a Comment