38.2 C
Hyderabad
April 28, 2024 22: 27 PM
Slider గుంటూరు

సొంత వారినే కాటేస్తున్న జే -మాఫియా..!

#sandmafia

ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే ..అరెస్ట్ లు..! ప్రశ్నిస్తే దాడులు! ఇదే పల్నాడులో జరుగుతున్న రౌడీ రాజకీయం. ఈ రాజకీయంలో వైసీపీ నేతలే అధికంగా బలయ్యారు. పల్నాడులోని 7 నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణాకు.., తవ్వకాలకు వేదికైంది. దీనికితోడు ఇసుక మాఫియా వ్యాపారం స్థానిక అధికారపార్టీ ఎమ్మెల్యేల అండదండలతో దందా మూడు పువ్వులు.. ఆరుకాయలు విరాజిల్లుతోంది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం పూర్తిగా కృష్ణా పరివాహక ప్రాంతంగా ఉంటుంది.

ఇక్కడున్న ఇసుక రీచ్ లపై అనేక కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. గత తెలుగు దేశం ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక విధానం తీసుకురావడంతో ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని పొందారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక అనే సహజ వనరును కమర్షియల్ మెటీరియల్ గా మార్చారు. దాతో ఇసుక రీచ్ ల వద్ద గతంలో ఎన్నడూ లేని ఆంక్షాలు తీసుకొచ్చారు. ప్రకృతికి, పర్యావణానికి విరుద్ధంగా ఇసుక ను నదీ గర్భం నుంచి తోడడం మొదలుపెట్టారు.

ఇసుకపై తాము జీవనం సాగిస్తున్నామని, తమ ఉపాధికి కూడా తొడ్పాటునివ్వాలని సొంతపార్టీ నేతలే పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. తట్టెడు ఇసుకను కూడా మీకు ఇప్పించలేను అని ఎమ్మెల్యే చెప్పడంతో స్థానికంగా ఉన్న వైసీపీ కేడర్ ఎమ్మెల్యేకు పూర్తిగా దూరమైంది. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసిన దండా నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి అరెస్ట్ హైడ్రామాకు తెరతీసింది.

దండా నాగేంద్రం వైసీపీ నాయకుడు. అమరావతి మండలంలో క్రీయశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉంటాడు. వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు అనుచరుడు. అయితే తమ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఒక్క పెదకూరపాడు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాడు నాగేంద్రం.

దీన్ని పరిశీలించిన ఎన్జీటీ తవ్వకాలు ఆపి.. జరిమానాలను విధించాలని ఆదేశించింది.  అంతేకాదు దాదాపు రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్ ల్లో తవ్వకాలను ఆపాలని ఆదేశాలిచ్చింది ట్రిబ్యూనల్. దీంతో కక్ష్య పెంచుకున్న జగన్ అండ్ కో.. నాగేంద్ర కుమార్ పై ఎస్సీ అట్రాసిటి కేసును బనాయించారు. ఈ కేసుతో ఎమ్మెల్యే నాగేంద్రకు దూరమయ్యాడు. మరోవైపు నాగేంద్రంపై అక్రమంగా అనేక కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఈ కేసులన్నీ అక్కసుతోనే కట్టారని తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందా గురించి నాగేంద్రం సాక్ష్యాలతో సహా నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అందించారని ఆరోపణలున్నాయి. దీన్ని జగన్ సీరియస్ గా తీసుకుని నాగేంద్రపై పీడీయాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో  కంచేటి సాయి అనే వైసీపీ లీడర్ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన నాగేంద్రను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పోలీసు వాహనాన్ని కదలనియ్యకుండా రోడ్డుపై బైఠాయించి నాగేంద్రం భార్య నిరసన తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాలపై పిర్యాదు చేసినందుకే తన భర్తపై కేసులు పెట్టారని ఆరోపించింది. తన భర్తకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే శంకరరావు, ఎస్పీ, డీఎస్పీలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే దండా నాగేంద్రం 59 మద్యం సీసాలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మీడియాకు వివరించడం హాస్యస్పదంగా ఉంది. ఈ కేసులో నాగేంద్రను కోర్టుకు హాజరుపరచగా.. రిమాండ్ విధించింది. నాగేంద్రం కుటుంబాన్ని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే జగన్ ను అక్రమాలను ప్రశ్నిస్తే వారు ఎమ్మెల్యే… ఎంపీ.. చివరికి చిన్నపాటి కార్యకర్త గానీ.. ఎవరని కూడా చూడకుండా.. దండించడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ కు ఫుల్ క్లారిటీ వచ్చింది.

Related posts

ప్రేమ… పెళ్లి… చోరీ… కేసు: ట్విస్టుల మధ్య లవర్స్

Satyam NEWS

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు..?

Bhavani

నూతన భారతావనికి స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తి

Satyam NEWS

Leave a Comment