34.2 C
Hyderabad
May 14, 2024 19: 30 PM
Slider విజయనగరం

రామ‌తీర్ధం విగ్ర‌హ ఘ‌ట‌న కేసులో వెబ్ సైట్ న్యూస్ కు స్పంద‌న‌…!

#VijayanagaramPolice

ప్ర‌ఖ్యాతి గాంచిన రామ‌తీర్దం బొడికొండ‌పై జ‌రిగిన రాములోరి విగ్ర‌హ శిర‌స్సు ఖండ‌న అంశంపై స‌త్యం న్యూస్ వెబ్ సైట్ ప్ర‌చురించిన వార్త నిజ‌మైంది. విగ్ర‌హ ఘ‌ట‌న పోలీసులు అదుపులో ముగ్గురు అన్న వార్త కు స్పంద‌న వ‌చ్చింది. వెను వెంట‌నే పోలీసులు హుటాహుటిన మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు.

ఈ మేర‌కు విగ్ర‌హ శిర‌స్సు ఖండ‌న విష‌యంలోఅనుమానితులను అదుపులో తీసుకున్నట్టు విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ తెలిపారు. త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా  స‌మావేశంలో ఈ విష‌యాన్ని తెలిపారు.ఇక రామ‌తీర్ధం లో రాములోరి శిరస్సు ఖండ‌న విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టత‌ ఇచ్చారు.

రామ‌తీర్ధంలో ప్ర‌ధాన‌ దేవాల‌యంలో ఉన్న రాముని విగ్ర‌హం కాద‌న్న విషయాన్ని ప్ర‌జ‌లంద‌రూ గమ‌నించాల‌న్నారు. అదే రామ‌తీర్దంలో బొడి కొండ‌పై దాదాపు 150 ఏళ్ల క్రితం వెల‌సిన రాముని విగ్ర‌హం శిర‌స్సు ను తొల‌గించార‌న్న విష‌యం ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవాల‌న్నారు. 

ఈ విష‌యంలో  ఇప్ప‌టికే మీడియా లో  విభిన్న క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయ‌ని….తద్వారా ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయని డీఎస్పీ అనిల్ తెలిపారు. దీంతో  బొడి కొండ‌పై వెల‌సిన రాముని విగ్ర‌హ తాలూకా  శిర‌స్సు ఖండ‌న గురైంద‌ని.. 24 గంట‌ల‌లోనే ఆ శిర‌స్సు దొరికింద‌న్నారు.

కాగా ఇందుకు సంబంధించిన కొంత‌మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌న్నారు. ఇందుకోసం అయిదు పార్టీలు విస్త్ర‌త గాలింపులు నిర్వ‌హించాయ‌న్నారు.ఈ మీడియా స‌మావేశంలో రూర‌ల్ సీఐ మంగ‌వేణి కూడా ఉన్నారు.

Related posts

బుమ్రా వుయ్ మిస్ యు: వరల్డ్ కప్ జట్టు ఇది

Satyam NEWS

విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఇమ్రాన్ ఖాన్

Satyam NEWS

కోరుకొండ, నవోదయ ప్రవేశ పరీక్షలకు త్రిశూల్ శిక్షణ

Satyam NEWS

Leave a Comment